ICC Champions Trophy Ind Vs Nz Final: టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే..! జట్టులో ఒక్క మార్పు తప్పదా..? బ్యాటింగ్ మరింత బలోపేతం
టీమిండియా ఒక మార్పు చేసి కివీస్ కు షాకిచ్చే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ ఒక్క మార్పుతో బ్లాక్ క్యాప్స్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందని భారత ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.

India Vs New Zealand Final Live Updates: భారత అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పాతికేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై పగ సాధించేందుకు భారత్ కసితో ఎదురు చూస్తోంది. దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ వేదికపై మెగాటోర్నీ మొత్తం ఆడిన టీమిండియా.. నాలుగు వరుస విజయాలతో జోష్ మీద ఉంది. లీగ్ దశలో కివీస్ పైనే ఇక్కడే విజయం సాధించడం జట్టు ఆత్మ విశ్వాసాన్ని పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అన్ని రంగాల్లో బలంగా ఉన్నటీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక మార్పు చేసి కివీస్ కు షాకిచ్చే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ ఒక్క మార్పుతో బ్లాక్ క్యాప్స్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందని భారత ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. జట్టు ఆటతీరు చూస్తుంటే ఒక్క మార్పు తప్పదని తెలుస్తోంది.
ఇంతకీ ఎవరిపై వేటు..?
జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ని పరిశీలించినట్లయితే, ఓపెనర్లు శుభమాన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరి నుంచి భారీ స్కోరును భారత్ ఆశిస్తోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో గిల్ సెంచరీ చేసిన తర్వాత విఫలమయ్యాడు.తను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇక రోహిత్ కూడా తన బ్యాట్ కు పని చెప్పాల్సిన పని ఉంది. వన్ డౌన్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆ త్వాత శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం.. దీంతో రిషభ్ పంత్ మరోసారి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశముంది.
మరో ఆల్ రౌండర్..
ఇక ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో కొనసాగడం ఖాయం.. అక్షర్, పాండ్యా.. రెండు విభాగాల్లో రాణిస్తుండగా, జడేజా బ్యాట్ తో మరిన్ని పరుగులు సాధించాల్సి ఉంది. ఇక ఏకైక పేసర్ వెటరన్ మహ్మద్ షమీని బరిలోకి దింపుతారు. దీంతో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ రిజర్వ్ బెంచ్ లో కొనసాగుతారు. ఫామ్ కోల్పోయి తంటాటు పడుతున్న కుల్దీప్ యాదవ్ పై వేటు వేసే అవకాశముంది. ఈ టోర్నీలో తను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ని ఆడించవచ్చు. కివీస్ పై వాషికి మంచి రికార్డు ఉంది. అలాగే తన ద్వారా మరో బ్యాటర్ జట్టులోకి వస్తాడు. దీంతో నెం.9 వరకు బ్యాటింగ్ ఆర్డర్ పెరుగుతుంది. మొత్తం మీద టాస్ సమయానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Read Also: Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్