టీమిండియా(Team India) సఫారీ గడ్డపై నయా చరిత్ర సృష్టించింది. కేవలం రోజున్నరలోనే ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)పై ఘన విజయం సాధించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా సీమర్లు నిప్పులు చెరిగిన వేళ రోహిత్‌ సేన విజయదుంధుభి మోగించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.  ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ కొత్త సైకిల్‌లో భార‌త్ ఇప్పటి వ‌ర‌కు నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో రెండు మ్యాచుల్లో గెల‌వ‌గా ఓ మ్యాచులో ఓడింది. మ‌రో మ్యాచును డ్రా చేసుకుంది. భార‌త్ ఖాతాలో 26 పాయింట్లు ఉండ‌గా 54.16 విజ‌య శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ద‌క్షిణాఫ్రికా రెండో స్థానానికి ప‌డిపోయింది.  ద‌క్షిణాప్రికా 12 పాయింట్లుతో 50.00 విజ‌య‌శాతంతో రెండో స్థానంలో నిలిచింది. త‌రువాత వ‌రుస‌గా న్యూజిలాండ్‌ మూడు, ఆస్ట్రేలియా నాలుగు, బంగ్లాదేశ్ అయిదో స్థానంలో నిలిచాయి. పాకిస్తాన్ ఆరో స్థానంలో.. వెస్టిండీస్ ఏడో స్థానంలో, ఇంగ్లాండ్ ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతున్నాయి. శ్రీలంక ఆఖ‌రి స్థానంలో నిలిచింది.


సఫారీలపై ఘన విజయం
దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం పాలైన భారత్‌ జట్టు.. రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో భారత పేసర్లు.. సఫారీ బ్యాటర్లలకు చుక్కలు చూపించి...విజయానికి బాటలు వేశారు. 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌... సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.


తొలి ఇన్నింగ్స్‌ సాగిందిలా...
కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. చెలరేగిన సిరాజ్ ధాటికి దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. సిరాజ్‌ ఆరు వికెట్లతో ప్రొటీస్‌ పనిపట్టాడు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా  బుమ్రా ధాటికి 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.  పడుతున్నా మార్‌క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. 103 బంతుల్లో 17 ఫోర్లు రెండు సిక్సులతో మార్‌క్రమ్‌ 106 పరుగులు చేశాడు. బుమ్రా  ఆరు వికెట్లు నేలకూల్చి దక్షిణాఫ్రికా పతనాన్నిశాసించాడు. అనంతరం 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.