IND vs SL 1st ODI: భారత్- శ్రీలంక మధ్య గువాహటి వేదికగా జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం చూపనున్న కారణంగా మొదట ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నట్లు ఆ జట్టు కెప్టెన్ దసున్ శనక చెప్పాడు.
'మేం టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. అయితే మొదటి బ్యాటింగ్ చేయడం కూడా మాకు సంతోషమే. రెండో ఇన్నింగ్స్ లో మేం మంచు ప్రభావంలో బౌలింగ్ చేయాల్సి ఉంది. నిన్నంతా పిచ్ మంచుతో నిండిపోయి ఉంది. అయితే ఈ ఏడాది ప్రపంచకప్ ఉన్నందున క్లిష్ట పరిస్థితుల్లో ఆడడం మేం అలవాటు చేసుకోవాలి. ప్రాథమిక అంశాలను విస్మరించకుండానే.. కొన్ని సమయాల్లో విభిన్నంగా ఆడడం ముఖ్యం. మేం సరైన దిశలోనే ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నాం.' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
ఇషాన్ కు నో ప్లేస్
బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ కు ఈ మ్యాచ్ లో స్థానం లభించలేదు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే అర్హదీప్ సింగ్ కాకుండా ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కింది. టీ20 సిరీస్ లో విఫలమైనప్పటికీ ప్రధాన స్పిన్నర్ గా చాహల్ నే ఎంచుకున్నారు. టీ20ల్లో విశేషంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ను తుది జట్టులో పరిగణనలోకి తీసుకోలేదు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు.
భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక తుది జట్టు
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.