IND vs SA Womens World Cup 2025 Final | వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. దాంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది మంచి ఛేజింగ్ గ్రౌండ్ అని వోల్వార్డ్ చెప్పింది. వర్షం వల్ల ఫస్ట్ బ్యాటింగ్ కు పిచ్ అంతగా అనుకూలించదు. ఛేజ్ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని భావించినట్లు తెలిపింది.
ఇండియా XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
దక్షిణాఫ్రికా XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, అన్నరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా
మహిళల ప్రపంచ కప్: నాకౌట్‌ల కోసం ICC నిబంధనలు
మ్యాచ్‌ను పూర్తి చేసే అవకాశాలను పెంచడానికి ICC మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు రెండు గంటల సమయం పొడిగింపు ఉంది. మ్యాచ్ కుదించబడితే, ఒక్కో ఇన్నింగ్స్‌కు 20 ఓవర్ల పోటీకి కటాఫ్ సమయం రాత్రి 9:08 PMకి సెట్ చేశారు. షెడ్యూల్ చేసిన రోజునే ఫలితాన్ని అందించడానికి అధికారులు ప్రయత్నం చేస్తారు.
వర్షం కొనసాగితే, కటాఫ్ సమయానికి ముందు ఆట ప్రారంభం కాకపోతే ఫలితాన్ని నిర్ణయించడానికి రిజర్వ్ డే అమలులోకి వస్తుంది. ప్రధాన లక్ష్యం అదే రోజున మ్యాచ్‌ను ముగించడం అయితే, వాతావరణం చెడు చేసినా కూడా సరైన ఫలితం సాధించేలా అత్యవసర ప్రణాళికలు ఉన్నాయి. మహిళల ప్రపంచ కప్ ఫైనల్ టాస్‌ను వర్షం రెండుసార్లు ఆలస్యం చేసింది. ప్రస్తుతం కవర్లు తీయడంతో కెప్టెన్లు టాస్ కోసం వచ్చారు. సఫారీ కెప్టెన్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుని, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.