Ind Vs Aus 3rd T20 Latest Updates: ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ, మిడిలార్డర్ బ్యాటర్లు టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74, 8 ఫోరలు, 5 సిక్సర్లు), మార్కస్ స్టొయినిస్ (39 బంతుల్లో 64, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ కు 3 వికెట్లు దక్కాయి. ఇక ఐదు టీ20ల సిరీస్ లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అర్షదీప్ ఇన్.. హర్షిత్ ఔట్..అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా మూడు మార్పులు చేసింది. సంజూ శాంసన్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ లను జట్టులోకి తీసుకుంది. ఈ మార్పు ఆరంభంలోనే కనిపించింది. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర్ ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లీష్ (1)లను అర్షదీప్ పెవిలియన్ కు పంపించాడు. ఈ దశలో కెప్టెన్ మిషెల్ మార్ష్ (11) తో కలిసి డేవిడ్ గేమ్ చేంజింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒక వైపు మార్ష్ యాంకర్ రోల్ పోషించగా, డేవిడ్ మాత్రం దూకుడుగా ఆడాడు.
23 బంతుల్లోనే..ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన డేవిడ్.. బౌండరీలతోనే డీల్ చేశాడు. రాగానే బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటిన డేవిడ్ సిక్సర్లతో చెలరేగాడు. ఎనిమిది బౌండరీలు, ఐదు సిక్సర్లతో సెంచరీ వైపు దూసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఇందులో సింహభాగం మార్ష్ వే కావడం విశేషం. అయితే తొమ్మిదో ఓవర్లో వరుస బంతుల్లో మార్ష్ , మైకెల్ ఓవెన్ ను డకౌట్ చేసి వరుణ్ చక్రవర్తి షాకిచ్చాడు. ఈ దశలో స్టొయినిస్ తో కలిసి డేవిడ్ .. జట్టును ముందుకు నడిపించాడు. 23 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత డేవిడ్ .. భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత స్టొయినిస్ ధాటిగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందించాడు. తను బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మథ్యూ షార్ట్ (26 నాటౌట్) తో కలిసి స్టొయినిస్ ఆరో వికెట్ కు - పరుగులు జతచేశాడు. ఇక ఈ వేదికపై ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్ స్కోరు 177 పరుగులు కాగా, ఇండియా రికార్డు బ్రేక్ స్కోరు చేస్తేనే విజయం సాధిస్తుంది. మిగతా బౌలర్లలో వరుణ్ కు రెండు వికెట్లు దక్కాయి.