IND vs SA 1st T20I Highlights | కటక్: టీ20 సిరీస్‌లో టీమిండియా దూకుడు కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికాతో కటక్ బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచులో భారత్ వంద పరుగులకు పైగా తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత పేసర్ అర్షదీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. పవర్ ప్లేలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్‌లో మొదటి 6 ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ సరసన అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు.

Continues below advertisement

టీ20లలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు

– అర్ష్‌దీప్ సింగ్ – 47 వికెట్లు (SR: 15.9)

Continues below advertisement

– భువనేశ్వర్ కుమార్ – 47 వికెట్లు (SR: 24.5)

జస్ప్రీత్ బుమ్రా – 33 వికెట్లు (SR: 25.4)

– అక్షర్ పటేల్ – 21 వికెట్లు (SR: 16.2)

– వాషింగ్టన్ సుందర్ – 21 వికెట్లు (SR: 18.2)

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20I - మ్యాచ్ అప్‌డేట్:

తొలి టీ20Iలో భారత్‌పై 176 పరుగులు ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కటక్‌లో జరిగిన తొలి T20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, హార్దిక్ పాండ్యా అజేయంగా చేసిన 59 (28 బంతుల్లో) పరుగుల సాయంతో 175/6 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు లైన్ అండ్త్ లెంగ్త్, కట్టుదిట్టుమైన బౌలింగ్ తో ప్రోటీస్ జట్టును కుప్పకూల్చారు. తద్వారా భారత్ 101 పరుగుల భారీ తేడాతో సమగ్ర విజయాన్ని నమోదు చేసింది. ఇది దక్షిణాఫ్రికాకు T20ల్లోనే అత్యల్ప స్కోరు. అంతకుముందు, భారత్ 175/6 పరుగులు చేసింది, ఇందులో హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 59* పరుగులు చేశాడు, ఇందులో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

తొలి మూడు ఓవర్లలోనే వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌లో ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ మంచి స్కోర్లు సాధించలేకపోయారు. దక్షిణాఫ్రికా తరఫున లుంగి ఎంగిడి మూడు కీలక వికెట్లు తీశాడు. 

ఛాంపియన్లను ఆదుకున్న పాండ్యా..

కటక్‌ T20 మ్యాచ్‌లో 11.4 ఓవర్లలో 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టు స్కోరు 150 కూడా చేరుకోవడం కష్టమైంది. ఈ పరిస్థితిలో, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్రీజులోకి వచ్చి, 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా చివరి ఎనిమిది ఓవర్లలో 95 పరుగులు జోడించి, స్కోరును 175/6కి చేర్చింది. పాండ్యా ప్రదర్శన టీ20 ప్రపంచ ఛాంపియన్స్ జట్టుకు భారత్‌ను రేస్‌లోకి తీసుకొచ్చింది.