IND vs SA 3rd T20 | ధర్మశాల: భారత్, దక్షిణాఫ్రికా జట్లు T20 సిరీస్ 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ అండ్ టీమ్ విజయం సాధించగా... రెండో టీ20 మ్యాచ్ లో పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చి విజయం సాధించింది. ఇప్పుడు మూడో T20 మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. పిచ్, వాతావరణ రిపోర్ట్, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, స్ట్రీమింగ్ వివరాలను తెలుసుకోండి.

Continues below advertisement

గత రెండు T20లలో భారత్ అతిపెద్ద బలహీనత టాప్ ఆర్డర్. ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ రెండుసార్లు మొదటి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలమవుతున్నాడు. గత 20 మ్యాచుల నుంచి అతని బ్యాట్ నుండి పరుగులు రావడం లేదు. అర్షదీప్ సింగ్ బౌలింగ్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. చండీగఢ్ లో జరిగిన రెండో టీ20లో ఏకంగా 9 వైడ్లు విసిరాడు. అర్షదీప్ ఒకే ఓవర్లో 7 వైడ్లు వేశాడు. భారత్ రెండో టీ20లో 22 పరుగులు ఎక్స్ట్రాలుగా ఇచ్చింది. 

ధర్మశాల స్టేడియం పిచ్ నివేదిక

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ పై బౌన్స్ చూడవచ్చు. ఇక్కడ మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు సహాయం అందుతుంది. కనుక బ్యాటర్లు ప్రారంభంలో పెద్ద రిస్క్ తీసుకోవడం మానుకోవాలి. మొదటి ఓవర్ నుంచే పెద్ద షాట్ ఆడకూడదు. కానీ 2, 3 ఓవర్లు ఇక్కడ ఆగి ఆడటానికి ప్రయత్నించాలి. తరువాత బ్యాటర్లకు సహాయం అందుతుంది. స్పిన్నర్లకు ఇక్కడ పెద్దగా కలిసిరాదు. కాబట్టి మరోసారి జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ బౌలింగ్ దాడి చేయవచ్చు. 

Continues below advertisement

ధర్మశాలలో ఈ మైదానంలో ఇప్పటివరకు 10 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగగా, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 4- 4 మ్యాచ్‌లు గెలిచాయి. 2 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ధర్మశాలలో మంచు కురిసే అవకాశం ఉంటుంది, కాబట్టి టాస్ గెలవడం చాలా ముఖ్యం.

ధర్మశాలలో వాతావరణం ఎలా ఉంటుంది

 ధర్మశాలలో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ నివేదిక ప్రకారం వర్షం పడే అవకాశం 10 శాతం ఉంది, కానీ ఉదయం నుండి మేఘాలు కమ్ముకుంటాయి. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 12, కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

భారత్, దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 అంచనా

భారత ప్లేయింగ్ 11 (అంచనా): అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 (అంచనా): క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, లుథో సిపామ్లా, లుంగి ఎన్గిడి, ఓట్నీల్ బార్ట్మన్

భారత జట్టు

అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు సామ్సన్ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

సౌత్ ఆఫ్రికా జట్టు

డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, డోనోవన్ ఫెరీరా (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్ (వికెట్ కీపర్), ఎన్రిక్ నోర్ఖియా, లుంగి ఎన్గిడి, లుథో సిపామ్లా, ఓట్నీల్ బార్ట్మన్.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో T20 సమయం

మూడో T20 డిసెంబర్ 14న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందు 6:30 గంటలకు టాస్ జరుగుతుంది.

ఏ ఛానెల్ లో లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడాలి

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో T20 ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో వస్తుంది.

ఏ యాప్ లో లైవ్ చూడాలి

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో T20 లైవ్ స్ట్రీమింగ్ జియోహోట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో వస్తుంది.