IND vs SA 3rd T20: భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టీ20 టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్నాడు. రెండో ఇన్నింగ్సులో పిచ్‌లో పెద్దగా మార్పులేమీ ఉండవని పేర్కొన్నాడు. కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌ ఆడటం లేదన్నాడు. వెన్ను సమస్యలతో అర్షదీప్‌కు విశ్రాంతి ఇచ్చామన్నాడు. ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాడు. శ్రేయస్‌ అయ్యర్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌ జట్టులోకి వచ్చారు. ఆన్రిచ్‌ నోకియా ప్లేస్‌లో డ్వేన్‌ ప్రిటోరియస్‌ను తీసుకున్నామని సఫారీ కెప్టెన్‌ తెంబా బవుమా వెల్లడించాడు.




భారత్‌: రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌


దక్షిణాఫ్రికా: తెంబా బవుమా, క్వింటన్‌ డికాక్‌, రిలీ రోసో, అయిడెన్‌ మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, త్రిస్టన్‌ స్టబ్స్‌, వేన్‌ పర్నెల్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడా, లుంగి ఎంగిడి




Huddle time! 👍👍#TeamIndia | #INDvSA | @mastercardindia pic.twitter.com/gYUjMQTwOB


— BCCI (@BCCI) October 4, 2022