IND vs PAK, T20 World Cup 2022 IND vs PAK Funny Memes: ఓటమి అంచుల వరకు వెళ్లిన మ్యాచ్ ను టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) తన అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 తొలి సూపర్ 12 మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్ పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ తో చెలరేగుతున్నారు.
ఇఫ్తికార్ అహ్మద్ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్ మసూద్ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 159/8కి పరిమితమైంది. తడబడుతూ ఛేజింగ్ చేసిన భారత్ 10 ఓవర్లకు 45-4 గా ఉంది. కానీ హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మ్యాచ్ ను 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు విజయానికి 16 రన్స్ కావాలి. పాండ్యా ఔటైనా, విరాట్ కోహ్లీ నోబాల్ ను సిక్సర్ గా మలవడం, ఫ్రీహిట్ బంతికి 3 పరుగులు తీశారు. చివరి బంతికి సింగిల్ తీసి భారత్ అపూర్వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ మాజీ క్రికెటర్లతో పాటు తోటి ఆటగాళ్లు విరాట్ బ్యాటింగ్ ను ప్రశంసించారు.
భారత్ ను ఎవరు గెలిపిస్తారు. కార్తీక్, విరాట్, అశ్విన్ అని ఆడియెన్స్ అడిగితే పాకిస్థాన్ బౌలర్లు మేమే అని చెప్పినట్లు ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
మీరు ఇంక ఏడవటం ఆపేయండి. మాకు ఇక్కడివరకు వినిపిస్తుంది అంటూ ప్రధాని మోదీ వీడియోను గిల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ ఓటమిని ఆర్డర్ చేసిందని, మీకు సర్వీస్‌గా విరాట్ ను ఇచ్చామంటూ జొమాటో తమదైన శైలిలో ఫన్నీ ట్వీట్ చేయగా నెటిజన్లు లైక్స్, కామెంట్లు చేస్తున్నారు.
పాకిస్థాన్ ఓడించి భారత్‌కు దీపావళి పండుగ తెచ్చారంటూ బీజేపీ నేత దేవెంద్ర ఫడ్నవీస్ ట్వీస్ చేశారు. భారత జట్టుకు కంగ్రాట్స్ చెబుతూ, కోహ్లీ ఆటను ప్రశంసించారు.
చివరి రెండు ఓవర్లలో టీమిండియా ఇలా ఆడింది అని కేజీఎఫ్ 2 స్టిల్స్ తో మీమర్లు చెలరేగిపోతున్నారు.
8వ ఓవర్ తరువాత భారత్ ఓడిపోతుందని మీమ్స్ రెడీ చేసుకున్న పాకిస్థాన్ మీమర్ల కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దామంటూ ఓ నెటిజన్ ఫన్నీగా స్పందించాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ వెళ్లి భారత్ ఆడదు అని మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
భారత్ మ్యాచ్ గెలిచే ఛాన్స్ 21 శాతం ఉందని, పాక్ కు మాత్రం 79 శాతం ఉందని ఓ స్క్రీన్ షాట్ ను సర్వైవర్ అనే పేజీ నుంచి ట్వీట్ చేశారు. ఇప్పటికైనా తెలిసిందా ఎవరు గెలుస్తారు, ఎవరికి నెగ్గే ఛాన్స్ ఉందంటూ సెటైర్లు వేశాడు.
మ్యాచ్ కు ముందు బాద్షా బాబర్ ఆజమ్ అని, టీ20 వరల్డ్ కప్ అతడి హయాంలో నడుస్తోందని ఐసీసీ ట్వీట్ చేసింది. మ్యాచ్ పూర్తయ్యాక కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ ఐసీసీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటికైనా ఐసీసీకి అసలైన బాద్ షా ఎవరో తెలిసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఎంతటి భారాన్ని మోశాడో చూడాలని ఓ అభిమాని ఈ ఫొటోను షేర్ చేశాడు. నెటిజన్ల నుంచి ఈ పోస్టుకు విశేషమైన స్పందన వచ్చింది.