ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల చూపంతా  భారత్‌-పాక్‌ మ్యాచ్‌పైనే ఉంది. ఈ ప్రపంచకప్‌లోనే  హై ఓల్టేజీ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులతో పాటు అతిరథ మహారథులు ఈ మ్యాచ్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పాక్‌ బౌలింగ్‌ దళానికి.. భారత బ్యాటింగ్‌ వీరులకు మధ్య పోరు ఎలా సాగుతుందా అన్న ఉత్కంఠ క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌లతో భీకరంగా ఉన్న భారత బ్యాటింగ్‌ లైనప్‌ పాక్‌కు చుక్కలు చూపించడం ఖాయమని భారత క్రికెట్‌ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ మహా సంగ్రామానికి ఇరు జట్లు అస్తశస్త్రాలతో.. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దమయ్యాయి. 

 

ఈ మ్యాచ్‌ వేళ సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. సచిన్‌ నుంచి సామాన్య అభిమాని వరకు ఈ మ్యాచ్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సోషల్‌ మీడియాలో తమ జట్టుకు మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఓసారి భారత్‌-పాక్‌ మ్యాచ్‌ గురించి క్రికెట్‌ దిగ్గజాలు ఏమన్నారో చూస్తే మతిపోవాల్సిందే.. ఇంతకీ ఏమన్నారంటే...

 

ప్రముఖుల మెసేజ్‌లు 

 భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌... అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లకు తల్లి- సచిన్‌ టెండూల్కర్

 భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను మించిన మ్యాచ్‌ ఇంకోటి  లేదు- ఇమ్రాన్ ఖాన్

 భారత్‌-పాక్‌ ఆడినప్పుడు..అది కేవలం క్రికెట్‌ మ్యాచ్ కాదు..అదో యుద్ధం:  గంగూలీ

 మీరు నిజమైన క్రికెట్‌ మ్యాచ్‌ను అస్వాదించాలంటే తప్పకుండా భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూడాల్సిందే: రాహుల్ ద్రవిడ్

 భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మ్యాచ్.. అందులో భాగం కావడం ఎప్పుడూ చాలా పెద్ద విషయమే: విరాట్ కోహ్లీ 

 

కొన్ని మెసేజ్‌లు వైరల్‌గా మారుతున్నాయి. అలాంటి పోస్టులు మీకోసం 

ఎస్‌ఎమ్‌ఎస్‌ల హోరు

 గో ఇండియా గో

మేం టీమిండియా గెలుస్తుందని నమ్ముతున్నాం

టీమిండియా ప్రపంచ కప్‌ను తిరిగి తీసుకురండి

మమ్మల్ని గర్వపడేలా చేయండి

టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించండి 

 

వాట్సప్‌ మెసేజ్‌లు

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఈ ఏడాదిలోనే అతిపెద్ద మ్యాచ్‌.. దానిని చూసేందుకు నేను చాలా ఆత్రుతగా ఉన్నాను.

టీమ్‌ఇండియా గెలిచి మనందరినీ గర్వపడేలా చేస్తే చూడాలని  ఉంది.

మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు ఉంది. పాకిస్థాన్‌ను రోహిత్‌ సేన ఓడించగలదని నాకు గట్టి నమ్మకం ఉంది.

 

ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు

క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కాదు. పాకిస్తాన్‌ను టీమిండియా ఓడిస్తుందని నాకు తెలుసు. 

భారత జట్టు విజయతీరాలకు చేరబోతుందని నాకు తెలుసు.

 

ఇన్‌స్పిరేషనల్‌ కోట్స్‌:

గర్వంతో ఆడండి. మీది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు. మీది అత్యుత్తమ జట్టు ఎందుకో ప్రపంచానికి చూపించండి. మేమంతా మీ వెంటే ఉన్నాం. కమాన్‌ ఇండియా మీరు పాకిస్థాన్‌ను ఓడించబోతున్నారని మాకు తెలుసు. మిమ్మల్ని చూసి గర్వపడే అవకాశం మాకు మళ్లీ ఇవ్వండి.

భారత జట్టు భారత్‌కు ప్రపంచ కప్‌ను తిరిగి తీసుకొస్తారనే నమ్మకం మాకు ఉంది. 

 

మరికాసేపట్లో  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. పాక్‌ బౌలింగ్‌ దళానికి.. భారత బ్యాటింగ్‌ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌లతో భీకరంగా ఉన్న భారత బ్యాటింగ్‌ లైనప్‌ పాక్‌కు చుక్కలు చూపించడం ఖాయమని భారత క్రికెట్‌ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.