ODI World Cup 2023, IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం కోసం మైదానంలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల రికార్డుల నుంచి కీలక రికార్డుల వరకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.


రికార్డుల్లో భారత్ చాలా ముందుంది
వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌లు మొత్తం ఏడుసార్లు తలపడగా, అందులో టీమ్‌ఇండియా ప్రతిసారీ విజయం సాధించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరి మధ్య తొలి పోటీ జరిగింది. ఆ తర్వాత 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ప్రతి ఒక్కసారీ టీమిండియానే గెలిచింది.


అందరి దృష్టి ఈ ఆటగాళ్లపైనే
భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లందరిపై అభిమానుల దృష్టి ఉంటుంది. అయితే ప్రత్యేక దృష్టి మాత్రం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిదిపైనే ఉంటుంది.


రోహిత్ శర్మ
ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై రోహిత్ శర్మ 140 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.


విరాట్ కోహ్లీ
పాకిస్తాన్‌పై అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీపైనే ఈసారి కూడా అందరి చూపు ఉంటుంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి సెంచరీ చేశాడు. ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌లో అతను ఆస్ట్రేలియాపై (85), ఆఫ్ఘనిస్తాన్‌పై (55 నాటౌట్) మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.


జస్‌ప్రీత్ బుమ్రా
భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.


మహ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ శ్రీలంకపై 345 పరుగులను ఛేదించే సమయంలో 131 పరుగుల (121 బంతుల్లో) అజేయ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు.


షహీన్ షా అఫ్రిది
టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్ ఫాస్ట్ బౌలర్లు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. షహీన్ షా అఫ్రిది కూడా రెండు మ్యాచ్‌ల్లోనూ చెరో వికెట్ మాత్రమే సాధించాడు. కానీ కొత్త బంతితో అతను భారత్‌పై శక్తివంతంగా నిరూపించుకోగలడు.


ప్రపంచకప్‌లో రెండు జట్ల స్క్వాడ్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్


పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, అఘా సల్మాన్. ఉసామా మీర్, అబ్దుల్లా షఫీక్