IND vs NED: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌ ఆడుతోంది. నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ వెంటనే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌ను వాడటంతో ఛేదనను ఇష్టపడటం లేదు.




ఫర్లేదన్న రోహిత్


ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం శిఖర స్థాయిలో ఉందని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. తాము గెలిచింది ఒక్కటే మ్యాచని ఇంకా చేయాల్సింది చాలా ఉందని వెల్లడించాడు. టోర్నీలో ప్రశాంతంగా ఉంటున్నామని పేర్కొన్నాడు. ఫలితాలు ఏమైనా మెరుగవ్వడమే తమ లక్ష్యమని వివరించాడు. ఇప్పటికే పిచ్‌ను 40 ఓవర్లు ఉపయోగించడంతో మందకొడిగా అవుతందని అంచనా వేశాడు. ఇలాంటి ట్రాక్‌లు తమకు అలవాటేనని పేర్కొన్నాడు. టాస్‌ గెలిస్తే తామూ మొదట బ్యాటింగే చేసేవాళ్లమని నెదర్లాండ్స్‌ కెప్టెన్ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ అన్నాడు. బౌలింగ్‌ చేసేందుకూ ఇబ్బందేమీ లేదని పేర్కొన్నాడు. తమ బ్యాటర్లు బాగా ఆడతారని ధీమా వ్యక్తం చేశాడు.


భారత్, నెదర్లాండ్స్ తుది జట్లు


భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌


నెదర్లాండ్స్‌: విక్రమ్‌ జీత్‌ సింగ్‌, మాక్స్‌ ఓడౌడ్‌, బస్ డి లీడ్‌, కొలిన్ అకెర్‌మన్‌, టామ్‌ కూపర్‌, స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌, టిమ్‌ ప్రింగిల్‌, లాగాన్‌ వాన్ బీక్‌, షరిజ్‌ అహ్మద్‌, ఫ్రెడ్‌ క్లాసెన్‌, పాల్‌ వాన్‌ మీకెరన్‌


ఆలస్యంగా టాస్


భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్ టాస్‌ను ఆలస్యంగా వేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు టాస్‌ వేయాలి. అయితే ఇదే మైదానంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ జరిగింది. ఆ పోరు పూర్తయ్యేవరకు టాస్‌కు అవకాశం రాలేదు. ఫలితంగా 20 నిమిషాలు ఆలస్యమైంది. అయితే మ్యాచ్‌ మాత్రం సమయానికే మొదలైంది.