టీమిండియా సారధి రోహిత్‌శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 14 వేల పరుగులకుపైగా చేసిన మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, టెస్టులు, ఐపీఎల్‌లో కలిపి 13,988 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల వద్ద 14 వేల మైలురాయిని రోహిత్ అందుకున్నాడు. రోహిత్‌తో పాటు మహ్మద్ అజారుద్దీన్ (15,593), వీరేంద్ర సెహ్వాగ్ (17,253), ఎంఎస్ ధోనీ (17,266), సౌరవ్ గంగూలీ (18,575), విరాట్ కోహ్లీ (21,788), రాహుల్ ద్రవిడ్ (24,208), సచిన్ టెండూల్కర్ (34, 357) పరుగులు చేశారు.
మరో రికార్డును కూడా రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివీలియర్స్ పేరు మీదున్న రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో సిక్సు కొట్టిన రోహిత్ ఈ అరుదైన ఘనత సాధిస్తాడు. 2015లో డివిలియర్స్ ఒకే ఏడాదిలో వన్డేల్లో 58 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ 60 సిక్సులతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్‌కు.. రోహిత్ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.
అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ప్రస్తుతం రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ కనపపడం లేదు. అత్యధిక సిక్సుల విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒక్కడే 315 సిక్స్‌లతో టాప్ 10లో చివరి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టాప్ టెన్‌లో మిగిలిన బట్లర్, రోహిత్ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ రిటైర్ అయిపోయారు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (283) 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు.
49 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ ప్రపంచకప్‌లో నమోదైనన్నీ సిక్సర్లు మరే వరల్డ్‌కప్‌లోనూ నమోదు కాలేదు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా ఓ ఎడిషన్‌లో ఐదు వందల సిక్సర్లు నమోదయ్యాయి. బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుండడంతో ఈ రికార్డు సాధ్యమైంది, రోహిత్ శర్మ సిక్సర్లతో ఆరంభం నుంచే విరుచుకుపడుతుండగా.. మ్యాక్స్‌వెల్, డికాక్, ఫకర్ జమాన్, వార్నర్ కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు.