ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో జోస్ బట్లర్‌ను రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో జోస్ బట్లర్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఆన్ సైడ్ బౌండరీ దగ్గర రవీంద్ర జడేజా పరిగెడుతూ వచ్చి దాదాపు కింద పడుతున్న సమయంలో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రపంచంలో జడేజాని బెస్ట్ ఫీల్డర్ అని ఎందుకు అంటారో ఈ ఒక్క క్యాచ్‌తో జడేజా తెలియజెప్పాడు. ఇది కీలకమైన జోస్ బట్లర్ వికెట్ కావడంతో అది ఇంగ్లండ్ త్వరగా ఆలౌట్ అవ్వడానికి కూడా ఉపయోగపడింది.
ఇంతకు ముందు కూడా జడేజా ఎన్నో సందర్భాల్లో తన ఫీల్డింగ్ పటిమను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఎంతో కష్టమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు విలువైన పరుగులు కాపాడటంలో జడేజా దిట్ట. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా బ్యాట్, బంతితో పాటు ఫీల్డింగ్‌లో కూడా జట్టుకు ఉపయోగపడ్డాడు. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో పాటు ప్రత్యేక ఫీల్డర్ల విభాగంలో జట్టులో స్థానం ఉంటే అది జడేజాకు కచ్చితంగా దక్కుతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ (60: 80 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.