IND VS ENG 3rd Latest Update: యూకే పర్యటననకు కేవలం ఒక్క విజయంతోనే భారత్ ముగించింది. ఆదివారం ముగిసిన మూడు వన్డేల సిరీస్ లోని ఆఖరి దైన మూడో మ్యాచ్ లో 27 పరుగులతో పరాజయం పాలైంది. దీంతో సిరీస్ ను 1-2తో కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (141) టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో ప్రసిధ్ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో పోరాడిన భారత్, ఓవర్లన్నీ ఆడి, 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేసింది. వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్బ్ సెంచరీ (110 బంతుల్లో 138, 17 ఫోర్లు, 5 సిక్సర్లు) తో లార్డ్స్ తో తొలి సెంచరీ చేసిన భారత ప్లేయర్ గా నిలిచాడు. బౌలర్లలో శామ్ కరన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఇక తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్.. వరుసగా రెండు వన్డేల్లో గెలిచి, సిరీస్ దక్కించుకోవడం విశేషం.
టాపార్డర్ సూపర్..భారీ టార్గెట్ తో బరిలోకి దిగినప్పటికీ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముందుగా భాగస్వామ్యాలు నెలకొల్పితే, భారీ స్కోరును ఛేజ్ చేసే చాన్స్ ఉంటుందనే ఫార్ములాను నమ్మింది. దానికి తగ్గట్లుగానే ఓపెనర్లు రోహిత్, కెప్టెన్ శుభమాన్ గిల్ (77) ఫస్ట్ వికెట్ కు సూపర్బ్ భాగస్వామ్యం నమోదు చేశారు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా గేర్లు మార్చారు. ముఖ్యంగా తొలుత రోహిత్ నెమ్మదిగా ఆడగా, గిల్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ తొలి వికెట్ కు 147 పరుగులు జోడించారు. ఈక్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే కాసేపటికే క్రాంప్స్ రావడంతో వేగంగా ఔటై, గిల్ ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ (74)తో జత కలిశాక రోహిత్ మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో లార్డ్స్ లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత క్రాంప్స్ తో ఇబ్బంది పడినా, ఎక్కువగా బౌండరీలు సాధించి, రిక్వైర్డ్ రన్ రేట్ కంట్రోల్లో ఉండేలా చూశాడు. అయితే కాసేపటికే తను వెనుదిరగడంతో కథ మారింది.
కుప్పకూలిన మిడిలార్డర్..టీమ్ మేనేజ్మెంట్ లెక్కలు తప్పి, బ్యాటింగ్ ఆర్డర్ లో సమయోచిత మార్పలు చేయక పోవడం కూడా శాపంగా మారింది. ముఖ్యంగా రోహిత్ ఔటైన తర్వాత సీనియర్ కేఎల్ రాహుల్ (12)ను పంపకుండా, ఇషాన్ కిషాన్ (14), శ్రేయస్ అయ్యర్ (0) లను పంపడంతో రన్ రేట్ పడిపోయింది. ఆ తర్వాత ఫిఫ్టీ పూర్తయిన తర్వాత ఒంటరి పోరాటం చేసిన కోహ్లీని కరన్ ఔట్ చేయడంతో ఇండియా రేస్ లో బాగా వెనుకబడింది. మిడిలార్డర్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెనుదిరగడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
