Ind Vs Eng 3rd Test: కెరీర్‌లో కీలక మ్యాచ్‌కు, స్టోక్స్‌, అండర్సన్‌ సిద్ధం

IND vs ENG 3rd Test: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో నేడు జరుగనున్న మూడో టెస్ట్‌లో.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తమ కెరీర్‌లలోనే కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యారు.

Continues below advertisement

IND vs ENG 3rd Test: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో నేడు జరుగనున్న మూడో టెస్ట్‌లో.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తమ కెరీర్‌లలోనే కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్‌ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌(james anderson ).. మరో ఐదు వికెట్లు తీయగలిగితే టెస్టులలో 700 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అండర్సన్‌కు ఇది 185వ టెస్టు కానుంది. అండర్సన్‌.. ఇప్పటివరకు 184 టెస్టులలో 695 వికెట్లు తీశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తో బ్రిటీష్‌ జట్టు సారధి బెన్‌ స్టోక్స్‌(Ben Stokes) వంద టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. స్టోక్స్‌కు రాజ్‌కోట్‌ టెస్ట్‌ వందో టెస్టు మ్యాచ్‌ కానుంది. వైజాగ్‌ వేదికగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టుతో స్టోక్స్‌ 99 టెస్టులు ఆడేశాడు. దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్‌ రాజ్‌కోట్‌ టెస్టును మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టుతో ఈ ఫార్మాట్‌లో ‘సెంచరీ’ కొట్టబోతున్న స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తరఫున 15వ క్రికెటర్‌గా నిలుస్తాడు.

Continues below advertisement

ఇంగ్లాండ్‌ తరపున 100 టెస్టులు ఆడిన ఆటగాళ్లు
జేమ్స్‌ అండర్సన్‌ -184
స్టువర్ట్‌ బ్రాడ్‌ -167
అలెస్టర్‌ కుక్‌ -161
జో రూట్‌ -137
అలెక్‌ స్టీవార్ట్‌ -133
గ్రాహం గూచ్‌ -118
ఇయాన్‌ బెల్‌ -118
డేవిడ్‌ గోవర్‌ -117
మైఖెల్‌ అథర్టన్‌ -115
కొలిన్‌ కౌడ్రే -114
జెఫ్రీ బాయ్‌కట్‌ -108
కెవిన్‌ పీటర్సన్‌ -104
ఇయాన్‌ బోథమ్‌ -102
గ్రాహమ్‌ థోర్ప్‌ -100
ఆండ్రూ స్ట్రాస్‌ -100

ప్రస్తుతం ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో అండర్సన్‌, రూట్‌ మాత్రమే ఉన్నారు. . స్టోక్స్‌ కూడా సెంచరీ క్లబ్‌ లో చేరుతుండటంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ ఏకంగా ముగ్గురు శతాధిక టెస్టులు ఆడిన క్రికెటర్లతో ఆడే జట్టుతో నిలిచారు. ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడిన స్టోక్స్‌.. 6,251 పరుగులు చేశాడు. 36.34 సగటుతో 13 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 197 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లలో జాక్వస్‌ కలిస్‌ (13,289 పరుగులు, 292 వికెట్లు), గ్యారీ సోబర్స్‌ (8,032 పరుగులు, 235 వికెట్లు) తర్వాత స్థానంలో స్టోక్స్‌ ఉన్నాడు.

చరిత్రకు ఒక్క వికెట్‌ దూరంలో     
ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఒక్క వికెట్‌ తీస్తే ఐదు వందల వికెట్లు తీసిన ఘనత సాధిస్తాడు. ఈ జాబితాలో భారత్‌ నుంచి అనిల్‌ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్‌ నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్‌ ఖాతాలో 499 వికెట్లున్నాయి. అశ్విన్‌ ఇంకో వికెట్‌ తీస్తే ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్  499 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు.

Also Read: రాజ్‌కోట్‌లో భారత్‌కు టెస్ట్‌, ఆధిక్యంపైనే ఇరుజట్లు దృష్టి

Also Read: వాలెంటైన్స్ డే స్పెషల్ - మన ఇండియన్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీస్

Continues below advertisement