భారత్ వేదికగా జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి నెలన్నర రోజుల ముందుగానే 16 మంది సభ్యుల జట్టును ప్రకటించి ECB ఆశ్చర్యపరిచింది. భారత్ వంటి ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లిష్ టీమ్‌కు సారథ్యం వహించనుండగా.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, జో రూట్‌తో పాటు బెయిర్‌స్టో, బ్రూక్, క్రాలీ, డకెట్, ఫోక్స్, లీచ్, పోప్, రాబిన్‌సన్, మార్క్ వుడ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. 16 మందితో కూడిన జట్టు ఎంపికలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. టామ్ హార్డ్లీ, గట్కిన్సన్, షోయబ్ బాషిర్ టెస్టులోకి అరంగేట్రం చేయనున్నారు.
ఇంగ్లాండ్ జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు.. నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పేసర్ క్రిస్ వోక్స్‌కు జట్టులో స్థానం దక్కలేదు. జాక్ లీచ్, రిహాన్ అహ్మద్‌లకు జట్టులో చోటు దక్కింది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, అట్కిన్సన్‌లు ఉన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్.. సిరీస్ ప్రారంభం నాటికి ఫిట్‌గా ఉంటాడా లేడా అన్నది తేలాల్సి ఉంది. జానీ బెయిర్ స్టో.. బెన్ ఫోక్స్‌లతో ఇద్దరు వికెట్ కీపర్‌లు జట్టులో చోటు సంపాదించారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచులు టెస్టు సిరీస్ జనవరి 25న ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి తొలి టెస్టు జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు.. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ప్రారంభం అవుతాయి. రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు.. ధర్మశాలలో మార్చి 7 నుంచి చివరిదైన ఐదో టెస్టు జరుగుతాయి.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్
భారత్ వేదికగా జరిగగుతున్న ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగులు చేసి వంద వికెట్లు తీసిన తొలి బ్రిటీష్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బెన్ స్టోక్స్.. ఇప్పటివరకూ 112 వన్డేలలో 3,379 పరుగులు చేసి 74 వికెట్లు తీశాడు. ఆలాగే 97 టెస్టులు ఆడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ 6,117 రన్స్ చేసి 197 వికెట్లు సాధించాడు. 43 టీ20లలో 585 పరుగులు చేసి 26 వికెట్లు తీశాడు. 2011 నుంచి ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్.. గతేడాది వన్డేలకు గుడ్ బై చెప్పినా వన్డే వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని ఆడుతున్నాడు. అయినా ఇంగ్లండ్ దశ మారలేదు. సెమీస్ కూడా చేరకుండానే బ్రిటీష్ జట్టు వెనుదిరిగింది.