IND vs BAN Live Streaming: రేపట్నుంచి బంగ్లా- టీమిండియా వన్డే సిరీస్- ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే!

టీమిండియా బంగ్లాదేశ్ తో పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు మీర్పూర్ లో తొలి వన్డేలే తలపడనుంది. న్యూజిలాండ్ తో సిరీస్ కు దూరమైన సీనియర్లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు.

Continues below advertisement

IND vs BAN Live Streaming:  టీమిండియా బంగ్లాదేశ్ తో పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు మీర్పూర్ లో తొలి వన్డేలే తలపడనుంది. న్యూజిలాండ్ తో సిరీస్ కు దూరమైన సీనియర్లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు మొదటి వన్డే ఆడనున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్ కు భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.

Continues below advertisement

ఓపెనర్లుగా రోహిత్, ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20, టెస్టులు ఆడని ధావన్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కివీస్ పర్యటనలో పర్వాలేదనిపించే ప్రదర్శన చేసిన శిఖర్ ఇప్పుడు మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరముంది. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఆడడం ఖాయం. నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్ ను ఆడించాలనుకుంటే అయ్యర్ ను పక్కన పెట్టవచ్చు. 

ఇక వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ పంత్ పంత్ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతనికి ఎన్ని అవకాశాలిచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నాడు. అతని గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని జట్టు యాజమాన్యం, కోచ్ అతనికి అండగా నిలుస్తున్నారు. మరి ఈ సిరీస్ లో అయినా రిషభ్ తన స్థాయికి తగ్గ ఆట ఆడతాడో లేదో చూడాలి.

షమీ దూరం

బంగ్లా సిరీసుకు ముందు టీమ్‌ఇండియాకు షాక్‌! సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి గాయపడ్డాడు. బంగ్లా టైగర్స్‌తో వన్డే సిరీసుకు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్ము కశ్మీర్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపికయ్యాడు. ప్రస్తుతం షమీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నాడు.

 

బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్),  రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ సేన్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. 

ఎక్కడ చూడాలి

ఈ సిరీస్ ను స్టార్ స్పోర్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. 

ఎప్పుడు చూడాలి

బంగ్లాదేశ్ తో వన్డేలు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

 

 


 

Continues below advertisement