సిడ్నీ: సిడ్నీ టెస్టులో విజయం కోసం భారత బౌలర్లు పోరాడుతున్నారు. కానీ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా లేకుండా బౌలింగ్ ఎటాక్ అంత తేలిక కాదని తేలిపోయింది. వన్డే తరహాలో రన్ రేటుతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు రాబట్టారు. లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది ఆసీస్. కానీ బుమ్రా అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న వాదన వినిపిస్తోంది. 


నిజమే బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ నుంచి లీడింగ్ వికెట్ టేకర్ మాత్రమే కాదు.. 46 ఏళ్ల బిషన్ సింగ్ బేడీ రికార్డును సైతం బుమ్రా బద్ధలుకొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద 5 అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ లో బేడీ పేరిట ఉన్న అత్యథిక వికెట్ల (31) రికార్డును సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా అధికగమించాడు. కానీ తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తూ బుమ్రా గాయపడ్డాడు. దాంతో విరాట్ కోహ్లీ జట్టును నడిపిస్తున్నాడు. కానీ బుమ్రా లేకపోవడంతో ఆసీస్ బ్యాటర్లు సిరాజ్‌, ప్రసిధ్ కృష్ణలపై ఆధిపత్యం చెలాయించారు. సిరాజ్ వికెట్లు తీయకపోగా, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ప్రసిద్ విషయానికొస్తే తీసిన 3 వికెట్లు అతడి ఖాతాలోనే ఉన్నా.. భారీ రన్ రేట్‌తో పరుగులు ఇవ్వడం భారత్ కు మైనస్ కానుంది.


గవాస్కర్ చెప్పినట్లే జరుగుతోంది..

కీలకమైన సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ కేవలం 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ గెలవాలంటే లంచ్ సమయానికి 91 పరుగులు అవసరం. ఉస్మాన్ ఖవాజా (19*), ట్రావిస్ హెడ్ (5*) క్రీజులో ఉన్నారు. గాయం కారణంగా పేసర్‌ బుమ్రా బౌలింగ్‌ చేయకపోతే ఆస్ట్రేలియాకు 200 టార్గెట్ ఇచ్చినా సరిపోదని సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే గవాస్కర్ చెప్పిందే నిజమవుతోంది. బుమ్రా ఫిట్‌గా ఉంటేనే భారత బౌలింగ్ ఎటాక్ పటిష్టమవుతుంది. జట్టు విజయానికి దోహదం చేస్తుంది. బుమ్రా బౌలింగ్ చేయలేకపోతే టీమిండియా 200 పరుగుల టార్గెట్ సైతం కాపాడుకోలేదు అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.


Also Read: Rishabh Pant Record: 148 ఏళ్లలో తొలిసారి.. ఆసీస్ గడ్డపై సరికొత్తగా పంత్ రికార్డు.. ఐదో టెస్టులో జూలు విదిల్చిన పంత్ 


100 వికెట్ల క్లబ్ లో సిరాజ్
మహ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ తీశాడు. దాటిగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ ఔట్ చేశాడు. కానీ భారీ నష్టం జరిగిపోయింది. ట్రావిస్ హెడ్ తో కలిసి 46 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాక ఖవాజా (41) వికెట్ దక్కింది. కీపర్ పంత్ క్యాచ్ పట్టడంతో ఖవాజా 4వ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తద్వారా టెస్ట్ కెరీర్ లో సిరాజ్ ఖాతాలో 100వ వికెట్ చేరింది. సిరాజ్, ప్రసిద్ధ్ ముందు పరుగుల వేగాన్ని నియంత్రించి, ఆపై ఒత్తిడి పెంచితే ఈ టెస్ట్ నెగ్గే అవకాశాలు ఇంకా లేకపోలేదు. కానీ అది అంత తేలికేమీ కాదు.