ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ జట్టు 152 పరుగులకే ఆలౌట్ అయింది. రహ్మత్ షా చారిత్రాత్మక హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అఫ్గాన్ జట్టు 200 పరుగుల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి టెస్టులోనే లోనే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.
భారత జట్టు 564 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అందుకు సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ టీం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మ్యాచ్ మూడో రోజున అఫ్గాన్ జట్టు స్కోరుబోర్డుకు మరో 39 పరుగులు మాత్రమే జోడించి అలౌట్ అయింది. అంటే చివరి 5 వికెట్లను నలభై పరుగుల్లోపే కోల్పోయింది. ఇదే సమయంలో రహ్మత్ షా టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీ చేసిన అఫ్గానిస్తాన్ తొలి బ్యాటర్‌గా నిలిచాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 60 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ల సెంచరీ ఇన్నింగ్స్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ ల హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మరోవైపు బౌలింగ్‌లో మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణలు అఫ్గాన్ జట్టు కనీసం 200 పరుగుల మార్కును కూడా దాటకుండా సత్తా చాటారు.
చరిత్ర సృష్టించిన మానవ్ సుతార్తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసి మానవ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ 33 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ అరంగేట్రంలోనే 5 వికెట్ల ప్రదర్శన చేసిన 10వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంకోవైపు ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.
ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియా ఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ టైమ్‌కు ముందు 23 ఏళ్ల సుతార్‌కు బంతిని అందించాడు.
క్రీజులోకి వచ్చిన అతను కేవలం నాలుగు బంతుల్లోనే వికెట్ తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. సుతార్ వేసిన ఫస్ట్ ఓవర్ నాల్గవ బంతికి అఫ్గాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్ స్వీప్ షాట్ ఆడబోయి టాప్ ఎడ్జ్ అయ్యాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని మొహమ్మద్ సిరాజ్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే తొలి వికెట్ సాధించిన సుతార్‌ను టీమిండియా ఆటగాళ్లు ఆలింగనం చేసుకుంటూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
