AUS vs ENG Match Abandoned: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్‌ వర్షార్పణం అయింది! ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సూపర్‌ 12 మ్యాచ్‌ బంతి పడకుండానే రద్దైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు దేశాల మధ్య మంచి రైవల్రీ ఉంది. భారత్‌, పాకిస్థాన్‌ తర్వాత ఈ మ్యాచ్‌నే ఎక్కువగా చూస్తుంటారు. ఇప్పటికే ఈ రెండు జట్లు కష్టాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మ్యాచ్ రద్దవ్వడం పెద్దదెబ్బే!


రెండు మ్యాచులూ రద్దు




లానినా ప్రభావం గ్రూప్1 జట్లపైనే ఎక్కువగా పడింది. శుక్రవారం షెడ్యూలు చేసిన రెండు మ్యాచులూ రద్దయ్యాయి. ఈ రెండింటికీ మెల్‌బోర్నే వేదిక కావడం గమనార్హం. స్టేడియంలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురిసింది. ఒకట్రెండు నిమిషాలు ఆగినా వెంటనే మళ్లీ జల్లులు మొదలయ్యాయి. దాంతో మధ్యాహ్నం అఫ్గాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌, ఆసీస్‌ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. వరుణుడు అస్సలు దయచూపక పోవడంతో మ్యాచ్‌ బంతి పడకుండానే ఆగిపోయింది.


ఆటగాళ్ల భద్రతే ముఖ్యం: ఆరోన్‌ ఫించ్‌


కొన్ని వారాలు ఔట్‌ ఫీల్డ్‌ విపరీతంగా తడిచిపోయింది. నేను ఇంతకు ముందెన్నడూ చూడనంత తడిగా మారిపోయింది. బౌలర్లు రనప్‌ చేసే చోట, సర్కిల్‌ ప్రాంతంలో చిత్తడిగా ఉంది. ఎందుకంటే క్రికెటర్ల భద్రతే ముఖ్యం. మొన్న జింబాబ్వే ఆటగాళ్లు పడిపోవడం చూశాం. మ్యాచ్‌ జరగకపోవడం బాధాకరమే కానీ కొన్ని వారాలు వస్తున్న వర్షం మాత్రం అద్భుతం. ఇక నుంచి రన్‌రేట్‌ కీలకం అవుతుంది. ఇక మా నియంత్రణలో ఉన్నది అఫ్గాన్‌, ఐర్లాండ్‌ మ్యాచులే!


నిరాశ కలిగించింది : జోస్‌ బట్లర్‌


మాకిది చాలా పెద్ద మ్యాచ్‌. ఆట రద్దవ్వడం నిరాశ కలిగిస్తోంది. టోర్నీలో మేం సజీవంగా ఉండాలంటే మిగిలిన మ్యాచులపై దృష్టి సారిస్తాం. చివరి మ్యాచులో మా ప్రదర్శన బాగాలేదు. మా ఆటగాళ్లపై నమ్మకం ఉంది. కుర్రాళ్లకు ఇప్పుడు చక్కగా విశ్రాంతి దొరికింది. బౌలర్లు సిద్ధంగా ఉన్నారు