ICC ODI Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజా ర్యాంకింగ్‌లో విరాట్ కోహ్లీ స్థానం మెరుగైంది. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన ODI సిరీస్‌లో 302 పరుగులు చేసిన కోహ్లీ ఇప్పుడు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో రెండవ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలలో ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్‌కు కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో కొన్ని స్థానాలు మెరుగయ్యాడు. 

Continues below advertisement

విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోని 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో సహా 302 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనకు గాను కింగ్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఈ ప్రదర్శనతో రన్ మేషిన్ కోహ్లీ నాల్గవ స్థానం నుండి రెండవ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ రేటింగ్ పాయింట్లు 773 కాగా, మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 146 పరుగులు చేశాడు. దాంతో మొదటి స్థానాన్ని నిలుపుకున్నాడు. కానీ కోహ్లీ నుంచి రోహిత్ నెంబర్ వన్ ర్యాంకుకు ముప్పు పొంచి ఉంది. రోహిత్ నిలకడగా రాణిస్తున్నప్పటికీ, కోహ్లీ అంతకుమించి సెంచరీలు చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు.

వన్డే బ్యాటర్లలో భారత్ టాప్-5 ఆటగాళ్లు వీరే

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో టాప్ 10లో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా మొదటి, 2 స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ ఆడకపోయినా రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదవ స్థానం సురక్షితంగా ఉంది. అయితే అతనికి బాబర్ ఆజమ్‌కు మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఒక్క పాయింట్ మాత్రమే కావడంతో నెక్ట్స్ సిరీస్ లో మెరుగ్గా ఆడితేనే టాప్ 5లో ఉంటాడు. టాప్-10లో నాల్గవ భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్, ఒక స్థానం పడిపోయి 10వ స్థానానికి చేరాడు. కేఎల్ రాహుల్‌కు 2 స్థానాలు మెరుగు పరుచుకుని వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో 12వ స్థానానికి ఎగబాకాడు. 

Continues below advertisement

బౌలర్లలో టాప్ 5లో కుల్దీప్, 29 స్థానాలు మెరుగైన అర్ష్‌దీప్ 

దక్షిణాఫ్రికాతో జరిగిన ODI సిరీస్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు తీసి సిరీస్‌లో సక్సెస్ ఫుల్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శన అతన్ని వన్డే బౌలింగ్ ర్యాంకింగ్‌లో 3వ స్థానానికి చేర్చింది. కుల్దీప్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-10 జాబితాలో ఉన్న ఏకైక భారత బౌలర్. మరోవైపు స్పిన్నర్ రవీంద్ర జడేజా 2 స్థానాలు కోల్పోయి 16వ స్థానానికి పడిపోయాడు. అయితే భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 29 స్థానాలు ఎగబాకి 66వ స్థానాన్ని సాధించాడు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు బౌలింగ్ ర్యాంకింగ్‌లో మరింత కిందకు వెళ్లాడు.