ICC Mens ODI Cricketer Of The Year 2023: క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023(ICC Mens ODI Cricketer of the Year 2023) నామినీలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ విడుదల చేసింది. క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీస్‌ జాబితాలో ఇద్దరు టీమిండియా(Team India) ఆటగాళ్లు బరిలో నిలిచారు. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన విరాట్‌ కోహ్లీ(Virat Kohli)తో పాటు రవీంద్ర జడేజా( Ravindra Jadeja)కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నారు. ఇద్దరు ఆసీస్‌ ఆటగాళ్లు కూడా ఈ పురస్కారం కోసం పోటీ పడుతున్నారు. పాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌ బరిలో నిలిచారు. టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీస్‌ జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ పోటీ పడుతున్నాడు. ఈ విభాగంలోనూ  ఇ‍ద్దరు ఆస్ట్రేలియన్లు  ట్రవిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖ్వాజా పోటీ పడుతున్నారు. ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ కూడా టెస్ట్‌ క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డులో పోటీలో ఉన్నాడు. 

 

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో ముగ్గురు 

వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 అవార్డు(ICC Men ODI Cricketer Of The Year 2023)లకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ(ICC) ప్రకటించింది. ఈ అవార్డు కోసం న‌లుగురు స్టార్‌ ఆట‌గాళ్లు పోటీ ప‌డుతుండగా.. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో అద్భుత ప్రద‌ర్శనతో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ(Virat Kohli), మ‌హ్మద్ ష‌మీ(Mohammed Shami)ల‌తోపాటు 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(Shubman Gill) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. న్యూజిలాండ్ (New Zealand)ప్లేయ‌ర్ డారిల్ మిచెల్‌(Daryl Mitchell) కూడా ఈ అవార్డు రేసులో నిలిచారు.

 

టీ 20 క్రికెటర్‌ రేసులో సూర్యా భాయ్‌

:ఐసీసీ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక‌  టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023, మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులకు స్టార్ ఆట‌గాళ్లు నామినేట్ అవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఈ రెండు అవార్డులకు ఇద్దరు భారత ఆటగాళ్లు పోటీ పడుతుండడం క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సుకత కలిగిస్తోంది. మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌.. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో యశస్వి జైస్వాల్‌ ఉన్నారు. ప్రతిష్ఠాత్మక‌ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023 కోసం టీ 20లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆటగాడు సూర్యకుమార్ యాద‌వ్... జింబాబ్వే సార‌థి సికింద‌ర్ ర‌జా, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్‌ మార్క్ చాప్‌మ‌న్, ఉగాండా సంచ‌ల‌నం అల్పేష్ ర‌మ్జానీ పోటీ పడుతున్నారు. 

 

జైస్వాల్‌ సాధిస్తాడా...

మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ, శ్రీలంక పేసర్‌ దిల్షన్‌ మధుషంక నిలిచారు. యశస్వి జైస్వాల్‌ 4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 718 పరుగులు చేసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. 2023లో రచిన్‌ రవీంద్ర 10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 578 పరుగులు చేయడమే కాకుండా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు.  గెరాల్డ్‌ కొయెట్జీ 8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయగా.. దిల్షన్‌ మధుషంక 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు.