న్యూఢిల్లీ: పురుషుల టీ20 వరల్డ్ కప్ ముగిసింది. 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. తాజాగా మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూల్ వచ్చేంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మలేసియా వేదికగా మహిళల అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జవవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వరకు టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. 


మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. భారత్ గ్రూప్ ఏలో ఉంది. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా 41 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్‌లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ సిక్స్ (Super Six) స్టేజ్ కు చేరుకుంటాయి. సూపర్‌ సిక్స్‌లో ఆరు జట్లతో రెండు గ్రూప్స్ ఉంటాయి. ఒక్కో గ్రూపులో  మొదటి 2 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. 


జనవరి 13 నుంచి 16 వరకు 16 వార్మప్‌ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీలో మలేసియా, సమోవా తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 3 తేదీలు రిజర్వ్‌ డేగా ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో భారత మహిళల టీమ్ సెమీ ఫైనల్స్‌కు చేరితే.. జనవరి 31న రెండో సెమీ ఫైనల్‌ ఆడాల్సి ఉంటుంది. ఇది రెండో అండర్-19 టీ20 ప్రపంచకప్ కాగా, భారత్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ మెగా టోర్నీలో భారత మహిళలు విజేతగా నిలిచారు. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ టీమ్ గెలుపొందింది. 






గ్రూప్‌ స్టేజీలో భారత్ మహిళల జట్టు జనవరి 19న వెస్టిండీస్‌, 21న మలేసియాతో, జనవరి 23న శ్రీలంక జట్లతో తలపడనుంది.


గ్రూప్ ఏ - భారత్ (ఏ1), వెస్టిండీస్ (ఏ2), శ్రీలంక (ఏ3), మలేషియా (ఏ4) జట్లు సెలంగోర్‌లోని బయుమాస్ ఓవల్‌లో మ్యాచ్‌లు ఆడతాయి
గ్రూప్ బీ - ఇంగ్లండ్ (బీ1), పాకిస్థాన్ (బీ2), ఐర్లాండ్ (బీ3), అమెరికా (బీ4) జట్లు జోహోర్‌లోని డాటో డా. హర్జిత్ సింగ్ జోహోర్ క్రికెట్ అకాడమీ (JసీA ఓవల్) తలపడతాయి 
గ్రూప్ సీ - న్యూజిలాండ్ (సీ1), దక్షిణాఫ్రికా (సీ2), ఆఫ్రికా క్వాలిఫైయర్ (సీ3), సమోవా (సీ4) సారవాక్‌లోని బోర్నియో క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ లు ఆడతాయి.
గ్రూప్ డీ - ఆస్ట్రేలియా (డీ1), బంగ్లాదేశ్ (డీ2), ఆసియా క్వాలిఫైయర్ (డీ3), స్కాట్లాండ్ (డీ4) సెలంగోర్‌లోని యూకేఎం వైఎస్‌డీ ఓవల్ (UKM YSD Oval)లో ఆడతాయి.