Hca Summer Camps Schedule Released : తెలంగాణ రాష్ట్రంలో  క్రికెట్ అభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (HCA) అధ్యక్షుడు అర్శన‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు కార్యచ‌ర‌ణ ప్రారంభించారు. ఔత్సాహిక యువ క్రికెటర్లకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌   అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాలలో ఈనెల 20 నుంచి నెల రోజుల పాటు వీటిని ఉచితంగా నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.  ప్రతి జిల్లాల్లో మూడు ప్రదేశాల్లో వేస‌వి శిక్షణ శిబిరాల‌ను నిర్వహించ‌నున్నామ‌ని, ప్రతి క్యాంప్‌లో 80 నుంచి 100 మంది పిల్లల‌కు అవ‌కాశ‌మిస్తున్నామ‌ని చెప్పారు.   సుమారు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు కనీసం 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్‌ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.


ఈ శిక్షణలో భాగంగా బాలురకు అండర్‌ – 14, 16, 19.. బాలికలకు అండర్‌ – 15, 19 వయో విభాగాల్లో ఉచిత ఈ క్యాంపులను నిర్వహించనున్నారు.  నేటి నుంచి   ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్‌ ప్రక్రియ మొదలవనుండగా ఆసక్తిగలవారు 18వ తేదీ (వ‌చ్చే గురువారం) సాయంత్రం 6 గంట‌ల లోపు ఆన్‌లైన్‌లో త‌మ పేర్లను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలని  కోరారు. మరి న్ని వివరాలకు హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌ (http://www. hycri cket.org) ను సంప్రదించాలని సూచించారు.   సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు, ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు శిక్షణ శిబిరాల‌ను  నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  ఈ స‌మ్మర్ క్యాంప్స్‌ను ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఎవ‌రికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన‌వ‌స‌రం లేదని జ‌గ‌న్‌మోహ‌న్ రావు  ఇప్పటికే స్పష్టం చేశారు.  శిక్షణ సమయంలో 30 రోజుల పాటు క్రికెటర్లకు పౌష్ఠికాహారం సైతం అందించనున్నారు. వేసవి శిక్షణ శిబిరాలను దీర్ఘకాలంలో క్రికెట్‌ అకాడమీలుగా రూపుదిద్దనున్నట్లు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఇప్పటికే  ప్రకటించిన విషయం గుర్తు చేశారు. ఏ జిల్లాలోనైనా నిపుణులైన కోచ్‌లు, ఫిజియోలు అందుబాటులో లేకుంటే.. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌లు, ఫిజియోలను జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. సమ్మర్‌ క్యాంప్‌ అనంతరం జిల్లా జట్లను ఎంపిక చేసి హైదరాబాద్‌లో జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లే వెల్లడించారు. జింఖానా తరహా క్రికెట్‌ మైదానాలను హైదరాబాద్‌లో మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఏ ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు.


కేంద్రాల వివ‌రాలు:


వ‌రంగ‌ల్‌: 98495 70979


పరకాల: 9666206662 


ములుగు: 90301 30727


మ‌హ‌బూబాబాద్‌: 98664 79666


భూపాల‌ప‌ల్లి: 88978 05683


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌: 94400 57849


గ‌ద్వాల్‌: 98859 55633


నాగ‌ర్ క‌ర్నూల్‌: 98854 01701


సంగారెడ్డి: 94408 47360


సిద్ధిపేట: 98499 55478


మెద‌క్‌: 99663 62433


నిజామాబాద్‌: 98490 73809


కామారెడ్డి: 96666 77786


ఆర్మూర్‌: 96405 73060


క‌రీంన‌గ‌ర్‌: 80087 29397


గోదావ‌రి ఖ‌ని: 98663 51620


సిరిసిల్ల: 94943 62362


ఖ‌మ్మం: 98486 62125


కొత్తగూడెం: 97050 07555


గౌత‌మ్‌పూర్: 99482 21777


మంచిర్యాల‌: 94400 10696


ఆదిలాబాద్‌: 94402 07473


సిర్‌పూర్‌: 94923 33333


జింఖానా: 90301 30346


ఫ‌ల‌క్‌నామా: 98852 95387


అంబ‌ర్‌పేట‌: 98665 82836


లాలాపేట‌: 99664 62667


మాదాపూర్‌: 80195 35679