India Captain Harmanpreet Reaches Historic Landmark Against Arch Rivals: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట సాధించింది. పురుషులు, మహిళల క్రికెట్ చరిత్రలోనే ఏకంగా 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ 2026 గ్రూప్ ఏ ఆఖరి పోరులో బరిలోకి దిగడం ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ మైలురాయిని అధిగ‌మించింది. ఇప్పటికే థాయిలాండ్, హాంకాంగ్‌లపై తిరుగులేని విజయాలతో దర్జాగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్, పాక్ ను కూడ ఓడించి లీగ్ దశను వరుసగా మూడు విజయాలతో ముగించింది. 

Continues below advertisement

టాప్ లో హర్మన్.. ఆట‌ప‌ట్టు, లానింగ్‌లను వెనక్కి నెట్టిన భార‌త కెప్టెన్పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సారథుల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ 150 మ్యాచ్‌లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆట‌ప‌ట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ సారథి మెగ్ లానింగ్ 100 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ లీడర్ హీథర్ నైట్, రువాండా కెప్టెన్ డయానే బిమెనియిమానా చెరో 96 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో నిలిఆరు. ఈ అరుదైన ఘనత సాధించడంపై హర్మన్ స్పందిస్తూ, "ఇదొక గొప్ప ఘనత. కానీ మైదానంలో ఆడుతున్నంత సేపు ఆటను ఆస్వాదించడం మాత్రమే అత్యంత ముఖ్యం, నేను అదే కొనసాగించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను" అని పేర్కొంది..

మెన్స్ రికార్డులు బ్రేక్.. ధోనిని వెనక్కి నెట్టిన హ‌ర్మ‌న్హర్మన్‌ప్రీత్ సాధించిన ఈ రికార్డు పురుషుల అగ్రశ్రేణి కెప్టెన్ల రికార్డులను కూడా ఎంతగానో అధిగ‌మించింది. మెన్స్ టీ20 క్రికెట్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 91 మ్యాచ్‌లతో అత్యధిక మ్యాచ్‌ల లీడర్‌గా ఉన్నాడు. ఇక ఇండియా తరఫున పురుషుల విభాగంలో మహేంద్ర సింగ్ ధోని 72 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి ఓవరాల్ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ 150 మ్యాచ్‌లకు చేరుకుని ధోనితో పాటు ప్రపంచ మేటి కెప్టెన్లందరినీ చాలా వెనక్కి నెట్టేసింది.

పాక్ చిత్తు.. ఇండియా హ్యాట్రిక్ విజ‌యం..ఇక మ్యాచ్ విష‌యానికొస్తే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ ను టీమిండియా మ‌రోసారి చిత్తు చేసింది. ఆసియాక‌ప్ 2026లో భాగంగా మ‌హిళా జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ లో ఏక‌ప‌క్షంగా 7 వికెట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భార‌త బౌల‌ర్ల ధాటికి 18.1 ఓవ‌ర్ల‌లో 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెన‌ర్ ష‌వాల్ జుల్ఫిక‌ర్ (14) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. బౌల‌ర్ల‌లో తెలుగు స్టార్ శ్రీ చ‌ర‌ణి, ప్రేమ రావ‌త్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటారు. అనంత‌రం ఛేద‌న‌ను కేవ‌లం 8.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 57 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ( 18 నాటౌట్) అజేయ బ్యాటింగ్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది.  ఫాతిమా స‌నాకు మూడు వికెట్లు ద‌క్కాయి.