U19 Women T20 World Cup: ఇటీవల మలేసియాలో ముగిసిన అండర్ - 19 మహిళా టీ20 ప్రపంచకప్ లో సంచలనం రేపిన తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష మంగళశారం స్వదేశానికి చేరుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెతోపాటు మరో క్రికెటర్ ధ్రుతి కేసరి, హెడ్ కోచ్ నూషిన్, ట్రైనర్ శాలిని తదితరులక స్వయంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం చీఫ్ జగన్మోహన్ రావు స్వాగతం తెలిపారు. అనంతరం వారిని సన్మానించారు.  ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ.. గత ఎడిషన్ లో పాల్గొన్నా, తనకు అంతగా అవకాశం రాలేదని, ఈసారి మాత్రం వచ్చిన చాన్స్ లను రెండు చేతులతో అందింపుచ్చుకున్నట్లు తెలిపింది. మలేసియాలో చాలా రోజుల  నుంచే ప్రిపేరయ్యామని, అక్కడి పిచ్ లపై అవగాహన ఉండటంతో ప్రపంచకప్ లో ఆడటం తేలికైందని తెలిపింది. ఆదివార కౌలాలంపూర్ లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్లను భారత్ ఓడించిన విజేతగా నిలిచింది. 2023 టోర్నీ ఆరంభ ఎడిషన్ లోనూ గెలిచిన భారత్.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకుంది. 

నాన్నే స్పూర్తి..తను ఇంత ఎత్తుకు ఎదగడం వెనకాల తన తండ్రి అకుంఠిత ధీక్ష ఉందని త్రిష తెలిపింది. చిన్నప్పటి నుంచి తన లక్ష్యం కోసం తను ఎంతగానో కష్టపడ్డాడని తెలిపింది. తన కుటుంబం కూడా ఎంతో సపోర్టుగా నిలిచిందని పేర్కొంది. అలాగే హైదరాబాదీ మహిళా దిగ్గజం మిథాలీ రాజ్ క్రికెటర్లలో తనకు స్ఫూర్తి అని త్రిష పేర్కొంది. చిన్నప్పటి నుంచి తన ఆట చూస్తూ పెరిగానిని, తన ఆట అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. ఇక తాజా టీ20 ప్రపంచకప్ లో త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఫైనల్లో 44 పరుగులతో అజేయంగా నిలవడంతోపాటు మూడు వికెట్లు తీసి ఆల్ రౌండ్ షో ప్రదర్శించింది. తను 2023 ఎడిషన్ లోనూ పాల్గొంది. 

త్రిషకు అరుదైన గౌరవం..ప్రపంచప్ లో సత్తా చాటి జోరు మీదున్న త్రిషకు మరో గౌరవం దక్కింది. తాజాగా మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన జట్ల నుంచి ఐసీసీ ఎంపిక చేసిన టీమ్‌లో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది.  గొంగడి త్రిషతో పాటు కమలిని, ఆయూషి, వైష్ణవి ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఈ కప్‌లో 147పైన స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికైన త్రిష.. స్కాట్లాండ్‌పై శతకం బాదింది. ఈ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. టోర్నీ ఆసాంతం త్రిషకు మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్‌ కమలిని 143 పరుగులు సాధించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో కమలిని (56) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు వైష్ణవి (17 వికెట్లు), ఆయూషి (14 వికెట్లు) బంతితో సత్తా చాటారు. కైలా రేనెక్ ను ఈ జట్టుకు సారథిగా ఐసీసీ ఎంపిక చేసింది. ఆమెతోపాటు, యెమా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెరిన్, కేథి జోన్స్‌ (ఇంగ్లాండ్‌), కోయ్‌మి బ్రే (ఆస్ట్రేలియా), చమోది (శ్రీలంక), పూజ మహతో (నేపాల్‌) కూడా ఈ జట్టుకు ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికాకి చెందిన నిని 12వ ప్లేయర్‌ గా ఎంపికైంది.  

Also Read: Abhishek Record: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్.. టీ20ల్లో ఇంగ్లాండ్ పై హయ్యెస్ట్..