Ind Vs Eng Test Series Updates: ఇండియాతో ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ప్లేయింగ్ లెవ‌న్ ను అనౌన్స్ చేసింది. మ్యాచ్ కు రెండు రోజులు ముందుగానే తుది జ‌ట్టును ప్ర‌క‌టించి, ముందంజ‌లో నిలిచింది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగానే ఈ తుదిజ‌ట్టు ఉండ‌టం విశేషం. ఇక రెగ్యుల‌ర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చాలా కాలం త‌ర్వాత పున‌రాగ‌మ‌నం చేశాడు. అత‌ను రావ‌డంతో జ‌ట్టులో స‌మ‌తూకం వ‌చ్చింది. ఇక జ‌ట్టు విష‌యానికొస్తే ఓపెన‌ర్లుగా విధ్వంస‌క ప్లేయ‌ర్లు జాక్ క్రాలీ, బెన్ డ‌కెట్ ఆడ‌తారు. వీరిద్ద‌రూ ఇటివ‌ల సూప‌ర్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవ‌ల జింబాబ్వేతో జ‌రిగిన నాలుగు రోజుల టెస్టులో మంచి భాగ‌స్వామ్యాల‌తో మ్యాచ్ ను మ‌లుపు తిప్పారు. ముఖ్యంగా డ‌కెట్.. అటు వైట్ బాల్ తో పాటు, ఇటు రెడ్ బాల్ తో నూ ఆక‌ట్టుకుంటున్నాడు. క్రాలీ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌తాడ‌నే త‌న పేరును నిల‌బెట్టుకుంటున్నారు. వీరిద్ద‌రూ ఓపెనింగ్ లో మంచి భాగ‌స్వామ్యం అందించాల‌ని టీమ్ మేనేజ్మెంటో కోరుకొంటోంది.

ప‌టిష్ట‌మైన మిడిలార్డ‌ర్..నెం.3లో ఒల్లీ పోప్,  ఆ త‌ర్వాత వ‌రుస‌గా మాజీ కెప్టెన్ జో రూట్, హేరీ బ్రూక్, బెన్ స్టోక్స్, జామీ స్మిత్ బ‌రిలోకి దిగుతారు. నిజానికి నెం.3లో ఆర్సీబీ స్టార్ జాక‌బ్ బెతెల్ కు అవ‌కాశం క‌ల్పించాల‌ని భావించినా, అనుభ‌వానికి పెద్ద పీట వేస్తూ, పోప్ ను ఆడిస్తున్నారు. ఇక నాలుగో నెంబ‌ర్లో దిగ్గ‌జ ప్లేయ‌ర్ రూట్ ఆడుతున్నాడు. త‌ను కూడా సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. గ‌త‌నెల‌లో జింబాబ్వేపై  మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చాడు. ఆ త‌ర్వాత బ్రూక్ కూడా స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాడు. టెస్టుల‌ను కూడా టీ20 త‌ర‌హాలో ఆడే బ్రూక్.. సొంత‌గ‌డ్డ‌పై త‌న ప‌దును చూపించాల‌ని భావిస్తున్నాడు. 

స‌మ‌తూకంతో..స్టోక్స్ తిరిగి రావ‌డంతో అటు మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ గానూ, ఇటు ఐదో బౌల‌ర్ గానూ సేవ‌లందించ‌గ‌ల‌డు. త‌న రాక ఇంగ్లాండ్ కి ఎంతో పెద్ద ప్ల‌స్ పాయింట్. ఆ త‌ర్వాత జేమీ స్మిత్ ..వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ గా సేవ‌లందించ‌నున్నాడు. వైట్ బాల్ క్రికెట్లో డ‌కెట్ తో క‌లిసి ఓపెనింగ్ చేసిన స్మిత్.. టెస్టుల్లో మాత్రం ఏడో స్థానంలో బ‌రిలోకి దిగుతాడు. ఇక ఆల్ రౌండ‌ర్ క్రిస్ వోక్స్ అందుబాటులోకి రావ‌డంతో బ్యాటింగ్ లో డెప్త్ పెరిగింది. గాయం కార‌ణంగా డిసెంబ‌ర్ నుంచి ఆట‌కు దూర‌మైన వోక్స్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. పేస‌ర్లుగా బైడెన్ కార్స్, జోష్ట టంగ్ బ‌రిలోకి దిగుతారు. ఇక ఏకైక స్పిన్న‌ర్ గా షోయ‌బ్ బ‌షీర్ ఆడ‌తాడు. గాయాల‌తో రెగ్యుల‌ర్ పేస‌ర్లు జోఫ్రా ఆర్చ‌ర్, మార్క్ వుడ్ దూరం కావ‌డం ఇంగ్లాండ్ కు కాస్త మైన‌స్ పాయింట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

భార‌త్ తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్:

స్టోక్స్ (కెప్టెన్), డ‌కెట్, క్రాలీ, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, టంగ్, కార్స్, బ‌షీర్.