ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం అడిలైడ్ ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ మరో వైపు నుంచి ఫైనల్‌లోకి ప్రవేశించింది.


ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
నవంబర్ 13వ తేదీన ఆదివారం మ్యాచ్ జరగనుంది.


ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు వేదిక ఏది?
మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.


ఇంగ్లండ్ vs పాకిస్థాన్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.


ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను టీవీలో లైవ్ ఎక్కడ చూడవచ్చు?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.


ఇండియాలో ఆన్‌లైన్‌లో ఇంగ్లండ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ని ఎక్కడ చూడవచ్చు?
మ్యాచ్ డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ అవుతుంది.


పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్.


ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, టైమల్ మిల్స్, ఫిలిప్ సాల్ట్