Duleep Trophy 2024 Live Updates | అనంతపురం: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. అనంతపురం (Anantapur) ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఇండియా ఏ, సీ జట్ల మధ్య, ఇండియా బీ, డీ జట్ల మధ్య ఆఖరి రౌండ్ మ్యాచ్ జరిగింది. ఇండియా–డీ ఆటగాడు సంజూ శాంసన్ (Sanju Samson) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇండియా– బీ బౌలర్ శైనీ 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా– బీ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 5 పరుగులు చేసి ప్రేక్షకులను నిరాశపరిచాడు. మరో మ్యాచ్‌లో ఇండియా– ఏ జట్టులో శాశ్వత్ రావత్ 124, అవేశ్‌ఖాన్ అర్ధసెంచరీ సాధించారు. ఇండియా– సీ జట్టులో అభిషేక్ పోరెల్ అర్ధ సెంచరీ చేశాడు.
సంజూ శాంసన్, అభిమన్యు ఈశ్వరన్ సెంచరీలు:
ఓవర్‌నైట్ స్కోర్ 306/5 పరుగులతో ప్రారంభించిన ఇండియా డీ జట్టు.. ఇండియా బీ బౌలర్ నవీదప్‌శైనీ దాటికి 87.3 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నవదీప్‌శైనీ (5 వికెట్లు) నిప్పులు చెరిగే వేగంతో బంతులను సందించాడు. దీంతో ఉదయం 43 పరుగులు మాత్రమే చేసి మిగితా 5 వికెట్లను ఇండియా డీ జట్టు కోల్పోయింది. డీ జట్టులో స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. 101 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 106 పరుగులు చేశాడు. అనంతరం ఇండియా బీ జట్టు ఆటముగిసే సమయానికి 56 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మరోసారి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 170 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 116 పరుగులు చేశాడు. జగదీషన్ 13, సుయాష్ ప్రభుదేశాయ్ 16, ముషీర్ ఖాన్ 5, సూర్యకుమార్ యాదవ్ 5, నితీష్‌కుమార్‌రెడ్డి డకౌట్ అయ్యారు. క్రీజ్‌లో వాషింగ్‌టన్ సుందర్ 39, రాహుల్ చాహర్ 0 ఉన్నారు. ఇండియా డీ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, ఆదిత్య థాకరే 2 వికెట్లు తీసుకున్నారు.
ఇండియా– సీ 216/7:
ఇండియా ఏ బౌలర్ అకీబ్ ఖాన్, సామ్స్ ములానీ ధాటికి ఇండియా సీ జట్టు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అకీబ్ ఖాన్ 3, సామ్స్ ములానీ 2 వికెట్లు తీసుకున్నారు. ఇండియా సీ జట్టులో అభిషేక్ పోరెల్ అర్ధ సెంచరీ సాధించాడు. 113 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 9 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. బాబా ఇంద్రజిత్ 34, రుతురాజ్ గైక్వాడ్ 17, సాయి సుదర్శన్ 17 పరుగులు చేశారు. నారంగ్ 35, వైశాక్ 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతకుముందు ఉదయం ఇండియా ఏ జట్టు ఓవర్‌నైట్ స్కోర్ 224/7తో ప్రారంభించి తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో శాశ్వత్ రావత్ 124, అవేశ్‌ఖాన్ 51(5 ఫోర్లు, 4 సిక్సులు), సామ్స్ ములానీ 44(5 ఫోర్లు, సిక్సర్), ప్రసిద్ద్ కృష్ణ 34(7 ఫోర్లు) సాధించారు. ఇండియా సీ బౌలర్లు వైశాక్ 4, అన్షుల్ కాంబోజ్ 3 , గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Also Read: Ind vs Ban Test: నీ పోరాటం అదిరిందయ్యా అశ్విన్ , స్పిన్నర్లే కాదు అదరగొట్టే బ్యాటర్లు కూడా