Deepti Sharma Shatters Jhulan Goswamis All Time Record:  ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆదివారం జూన్ 28న ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఒక అన్‌బిలీవబుల్ మైలురాయిని అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న‌ ఐసీసీ ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ లో దీప్తి ఈ రేర్ ఫీట్ సాధించింది. ఇండియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి పేరిట ఉన్న 355 వికెట్ల ఆల్ టైమ్ రికార్డును క్రాస్ చేయడానికి దీప్తికి ఈ మ్యాచ్ కు ముందు కేవలం ఒక్క వికెట్ మాత్రమే అవసరమైంది. ఆస్ట్రేలియా ఛేజింగ్ 10వ ఓవర్ లో  వెట‌ర‌న్ బెత్ మూనీని అవుట్ చేయడం ద్వారా దీప్తి తన కెరీర్ లో 356వ వికెట్ పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది.

Continues below advertisement

Continues below advertisement

మూడు ఫార్మాట్లలోనూ దీప్తి శర్మ హవాఇండియా తరఫున ప్రెజెంట్ 278వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ ఆగ్రా బౌలర్, ప్రెజెంట్ 356 వికెట్లతో వరల్డ్ వైడ్ గా టాప్ లీడింగ్ వికెట్ టేక‌ర్ గా నిలిచింది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ లోనే దీప్తి 5-వికెట్ హాల్  తీసి సత్తా చాటింది. ఇప్పటివరకు తన కెరీర్ లో 6 టెస్ట్ మ్యాచుల్లో 22 వికెట్లు, 124 వన్డే మ్యాచుల్లో 166 వికెట్లు, అలాగే 148 టీ20 ఇంటర్నేషనల్స్ లో 168 వికెట్లు పడగొట్టింది. టెస్టుల్లో 5/71, వన్డేల్లో 6/20, టీ20ల్లో 5/10 ఆమె బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కావడం విశేషం. వన్డే వరల్డ్ కప్ 2025 లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గెలిచిన దీప్తి, ఆల్రెడీ ఉమెన్స్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా థాయిలాండ్ స్పిన్నర్ తిపాట్చా పుత్తవాంగ్ (165 వికెట్లు) కంటే ముందే టాప్ లో సెటిల్ అయింది.

Read Also: Record Breaker Shree Charani: రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!

వరల్డ్ వైడ్ గా టాప్ బౌలర్లు వీరేమరో ఎండ్ లో ఇండియా లెజెండ్ ఝులన్ గోస్వామి తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ లో 284 మ్యాచుల్లో 355 వికెట్లతో రిటైర్ అయింది. ఝులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు, 204 వన్డేల్లో 255 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లు తీసింది. ఇప్పుడు దీప్తి శర్మ కేవలం 278 మ్యాచుల్లోనే ఝులన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ వికెట్స్ తీసిన టాప్ బౌలర్ల లిస్టు చూస్తే ప్రెజెంట్ దీప్తి (356), ఝులన్ (355) తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ 336 వికెట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు కాథరిన్ స్కివర్ బ్రంట్ 335 వికెట్లు, సోఫీ ఎకిల్‌స్టోన్ 333 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉండగా, సౌతాఫ్రికన్ షబ్నిమ్ ఇస్మాయిల్ 321 వికెట్లతో రేసులో ఉంది.