India vs South Africa Match Preview:రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్(Team India )-దక్షిణాఫ్రికా(Sout Africa) జట్ల మధ్య మొదటి టెస్టు(First TEst) ప్రారంభంకానుంది. సెంచూరియన్(Centurion Cricket Ground ) వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత బౌలర్లు నెట్స్‌లో ఎర్ర బంతితో చెమటోర్చారు.


మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత పేసర్లు, స్పిన్నర్లు నెట్స్‌లో కష్టపడుతున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ వీడియోలో కనిపించాడు. ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ చేస్తున్నారా వీడియోలో. 


శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా కనిపించారు. వీడియో చివర్లో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లతో మాట్లాడుతున్నట్టు ఉంది. టీమ్ఇండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మహ్మద్ షమీ గాయం కారణంగా ఆఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. 


వర్షం ప్రభావం


India vs South Africa 1st Test weather report:  మొదటి టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సూపర్‌స్పోర్ట్ పార్క్ క్యూరేటర్ బ్రయాన్ బ్లాయ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా మొదటి రోజు ఆట జరగడం చాలా కష్టమని అన్నారు. ప్రారంభ రోజు మూడు సెషన్‌లు వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.


ఈ మ్యాచ్‌లో జహీర్‌ఖాన్‌ రికార్డుపై జస్ప్రీత్ బుమ్రా కన్నేశారు. జహీర్ ఖాన్ దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో 30 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు పడగొడితే జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డు సృష్టిస్తారు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ ప్లేస్‌లోకి బుమ్రా వస్తారు. 


సౌతాఫ్రికాలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ బౌలర్లు...
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నారు. అనిల్ కుంబ్లే 12 మ్యాచుల్లో 45 వికెట్లు పడగొట్టారు. జవగళ్ శ్రీనాథ్ 43 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై మహ్మద్ షమీ 35 వికెట్లు పడగొట్టారు. అయితే, ఈ టెస్టు సిరీస్‌లో మహ్మద్ షమీ అందుబాటులో లేరు. మహ్మద్ షమీ తర్వాత జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డు అద్భుతమని గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 6 టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టారు. 2 సార్లు 5 వికెట్లు తీశారు. 


ఈ టెస్టు సిరీస్‌పై మాట్లాడేందుకు ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. వాస్తవానికి రెండు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. సెంచూరియన్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. 


'దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ గెలవడం ద్వారా ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని పూడ్చుకోగలమో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వరల్డ్ కప్ అంటేనే అదో లెక్క. ఈ రెండింటినీ పోల్చలేం. అయితే భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. మేం గెలవగలిగితే నిజంగా సంతోషం. మనం కష్టపడి పని చేస్తున్న కొద్దీ భారీ విజయం కావాలని అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ గెలవాలని మేమంతా కోరుకుంటున్నాం. కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తామని ఆశాభావంతో ఉన్నాం. అన్నారు. 


'నిజం చెప్పాలంటే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత..
ప్రపంచకప్ ఫైనల్లో ఓటిమిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలాంటి ఓటములు జీర్ణించుకోవడం అంత సులువు కాదని, కానీ కెరీర్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నారు. అలాంటి ఓటమి తర్వాత కోలుకోవడానికి సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ప్రజల నుంచి చాలా మద్దతు లభించింది. ఆ ఓటమిని మర్చిపోయి మళ్లీ నా పని ప్రారంభించాలని అభిమానులు ప్రోత్సహించారు అని అన్నారు. దాదాపు 36 రోజుల క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మీడియాతో మాట్లాడాడు.


ఇరు జట్ల ప్లేయింగ్-11


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.


దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జార్జ్, టెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్/ డేవిడ్ బుడింగ్హామ్, కైల్ వెర్రెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సిన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోట్జీ, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.