అది ఆస్ట్రేలియాతో ప్రపంచకప్‌ ఆరంభ పోరు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారు జట్టును భారత బౌలర్లు పూర్తి ఓవర్లు కూడా ఆడనీయలేదు. 200 పరుగుల మార్క్‌ కూడా చేరుకోనివ్వలేదు. టీమిడియా బౌలర్ల ధాటికి ఆసిస్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో కంగారులు 200 పరుగుల మార్క్‌ కూడా చేరుకోలేదు. ఇక దాయాది పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే దాయాది జట్టు చివరి ఎనిమిది వికెట్లను 36 పరుగులకే కోల్పోయింది. ఇక ఇంగ్లండ్‌తో 250లోపు పరుగులను టీమిండియా బౌలర్లు కాపాడారు. వరుసగా వికెట్లు తీస్తూ బ్రిటీష్‌ జట్టు వెన్నువిరిచారు. ఇవి చాలు ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా బౌలింగ్ దళం ఎంత ప్రభావవంతంగా బౌలింగ్‌ చేస్తుందో చెప్పడానికి. ఒకప్పుడు స్పిన్నర్ల కేంద్రంగా పేరొందిన భారత జట్టులో ఇప్పుడు నాణ్యమైన పేసర్లు ఉన్నారు. పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జట్టుకు వికెట్‌ అవసరమైన ప్రతీసారి వికెట్‌ అందిస్తూ ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు ఓటమనేదే లేకుండా ముందుకు సాగేలా చేస్తున్నారు. బుమ్రా, మహ్మద్‌ షమీ బౌలింగ్‌ను ఎలా ఆడాలో తెలియక ప్రత్యర్థి బ్యాటర్లు చతికిలపడుతున్నారు.



 ఈ ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌ దళంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత బౌలింగ్ అంచనాలకు మించి రాణిస్తోంది. టీమిండియా  పేస్‌ విభాగం అద్భుతంగా ఉందని బౌలింగ్‌ దళం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్‌ చేసేందుకు టీమిండియా బౌలర్లు అద్భుతమైన బంతులు సంధించి ఒత్తిడిని సృష్టిస్తున్నారు. ఒకరు పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచుతుండగా మరొకరు చాకచాక్యంగా వికెట్లు తీసి పని పూర్తి చేస్తున్నారు. ఈ బౌలింగ్‌ ప్రణాళికతోనే ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ మేధావి అయిన బుమ్రా తనను తాను నిరంతరం మెరుగు పరుచుకుంటూనే ఉన్నాడు. 



 ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌ అని పాకిస్థాన్‌ మాజీ స్టార్‌ వసీమ్‌ అక్రమ్‌ కితాబిచ్చాడంటే  భారత బౌలర్ ఎలా రాణిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బుమ్రా భలే బోల్తా కొట్టించాడని, గొప్ప వేగంతో బంతులు వేశాడని వసీం అక్రమ్‌ కొనియాడాడు. తొలి ఓవర్లోనే కొన్ని బంతులను ఇన్‌స్వింగ్‌ చేసిన బుమ్రా... ఒకట్రెండు ఔట్‌ స్వింగర్లు కూడా వేశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌ వేగం, లెంగ్త్‌ అద్భుతం. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడే అత్యుత్తమ బౌలర్‌ అతడే అని వసీం పొగడ్తల వర్షం కురిపించాడు. బుమ్రా తనలాగే ఔట్‌ స్వింగర్లను వేస్తున్నాడని వసీం అన్నాడు. అంతేకాదు కొన్నిసార్లు తనను మించిన నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్నాడని అక్రమ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. బుమ్రా బౌలింగ్‌ చేసే తీరు అక్రమ్‌ కొత్త బంతితో బంతులు వేసే విధానాన్ని గుర్తుకు తెస్తోందని మరో పాక్‌ మాజీ స్టార్‌ మిస్బావుల్‌ హక్‌ అన్నాడు. 



 భారత బౌలింగ్ గత మూడు మ్యాచ్‌ల నుంచి అంచనాలకు మించి రాణిస్తోందని.. ఇది ఒక్క వ్యక్తి మాత్రమే చేసిన ప్రదర్శన కాదని పాక్‌ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అన్నాడంటే టీమిండియా బౌలింగ్‌ దళం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌ దళం అంచనాలను మించి రాణిస్తోంది. ఆరంభంలోనే బుమ్రా, షమీ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా పేస్‌ విభాగం గతంలో లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో షమీకి తొలి నాలుగు మ్యాచుల్లో ఆడే అవకాశం దక్కలేదు. కానీ తర్వాత దొరికిన అవకాశాన్ని షమీ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.