Shubman Gill: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి సెమీ ఫైనల్స్ రసవత్తరంగా సాగుతోంది. వాంఖేడే స్టేడియం బ్యాటింగ్ కి అనుకులమైనది కావటంతో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్‌తో మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ-గిల్ అదిరే ఆరంభాన్నివ్వగా... విరాట్ కోహ్లీ ఆ ఆరంభాన్ని ముందుకు తీసుకెళాడు.
స్వదేశం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఓపెనర్.. బంగ్లాతో జరిగిన మ్యాచ్ నుంచి తన ఆట షురూ చేశాడు. సిక్స్ లు, ఫోర్ లతో రెచ్చిపోయాడు. దొరికినప్పుడల్లా హాఫ్ సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఈ సెమీ ఫైనల్ మ్యాచ్లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెమీ ఫైనల్స్‌లో తొలి అర్ధసెంచరీ అతనిదే. 40 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. రచిన్ రవీంద్ర లో- ఫుల్‌టాస్ సంధించిన 14వ ఓవర్ మూడో బంతిని లాంగాఫ్ దిశగా తరలించడంతో అతని అర్ధసెంచరీ ముగిసింది. చివరి నాలుగు మ్యాచ్‌లల్లో అతను చేసిన మూడో హాఫ్ సెంచరీ ఇది. అయితే ఈ మ్యాచ్ ను స్టాండ్స్‌లో కూర్చొని చూస్తున్న సారా టెండుల్కర్.. గిల్ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఎగిరి గంతేసింది. పక్కనే ఉన్న తన స్నేహితురాలితో ఆనందాన్ని పంచుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేసింది. ఈ వీడియో క్లిప్ మరోసారి సోషల్ మీడియాను దున్నేస్తోంది. భారత్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ హాజరైంది. మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలిపింది. గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది.
సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో అప్పట్లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా సైతం హాజరవుతూ రావటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. మరోసారి సారా మ్యాచ్‌కు హాజరుకావడంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ వార్తల్లో నిలిచారు. ఈ రూమర్లకు సారా టెండూల్కర్ ప్రవర్తన బలం చేకూర్చుంది.
గతేడాది క్రితం వరకు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది.
తాజాగా సారా టెండూల్కర్.. టీమిండియా మ్యాచ్‌కు హాజరవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమయాణం వార్తల్లో నిలిచింది. గిల్ బౌండరీ కొట్టిన ప్రతీసారి కెమెరామెన్ సారాను చూపించడంతో స్టాండ్లలో ఉన్న ఫ్యాన్స్ ఈలలు, కేరింతలతో ఊగిపోయారు. అయితే మ్యాచ్ లో రోహిత్ 47 పరుగులకు ఔట్ కాగా శుభ్ మన్ గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 65 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు.