Virat Kohli :టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) చిక్కుల్లో పడ్డారు. బెంగళూరులోని విరాట్‌ కోహ్లీకి చెందిన వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు(Bengaluru)లోని కస్తుర్భా రోడ్డులోని విరాట్‌ కోహ్లీకి చెందిన వన్‌ 8 కమ్యూన్ పబ్‌(One 8 Commune Pub)ను నిబంధనలను ఉల్లంఘించి సమయం మించిపోయినా నడిపించారని బెంగళూరు పోలీసులు తెలిపారు. 


అందుకే విరాట్ కోహ్లీకి చెందిన వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌పై కేసు నమోదు చేశామన్నారు. గత రాత్రి 1:30 వరకు పబ్‌ను నడిపారని.. వన్‌8 కమ్యూన్‌తో పాటు మరో నాలుగు పబ్‌లపైనా కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. బెంగళూరులో పబ్‌లను రాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకే అనుమతి ఉందని కానీ... ఈ పబ్‌లు నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపారు. విరాట్‌ పబ్‌లో మ్యూజిక్‌ను కూడా భారీ సౌండ్‌తో ప్లే చేస్తున్నారని కూడా తమకు ఫిర్యాదులు అందాయని బెంగళూరు పోలీసులు తెలిపారు.


అర్ధరాత్రి బెంగళూరులోని కస్తూర్బా ప్రాంతంలోని పబ్‌లలో బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్ణీత సమయానికి మించి పబన్‌ను నడిపించిన విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్‌పైన కూడా అందుకే కేసు నమోదు చేశామని వెల్లడించారు. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న వన్8 కమ్యూన్ పబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశామని బెంగళూరు డీసీపీ తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని.. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాంమని వె్లలడించారు. నిర్ధేశించిన వ్యవధిని దాటి కస్టమర్లకు అనుమతించిన పబులు, రెస్టారెంట్లపై కేసు నమోదు చేశామని బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ వెల్లడించారు. కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌ మాత్రమే కాకుండా సెంట్రల్ డివిజన్ పరిధిలో టైం దాటినా నడిచిన మరికొన్ని రెస్టారెంట్లు, పబ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. విరాట్ కోహ్లీ ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, హైదరాబాద్‌,  బెంగళూరుల్లో వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌లు ఉన్నాయి . గత ఏడాది డిసెంబర్‌లో బెంగళూరు బ్రాంచ్‌ను కోహ్లీ ప్రారంభించాడు.  అనుష్క శర్మ, వామికా, అకాయ్‌లను కలిసేందుకు  కోహ్లీ లండన్‌ వెళ్లాడు.