ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) వివాదంలో చిక్కుకున్నాడు. మాక్సీ ఇటీవల ఫుల్గా తాగి పడిపోయాడు.  అతడిని అంబులెన్స్‌లో  ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) బోర్డు  సీరియస్ అయ్యింది. మాక్స్‌వెల్‌కు అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం దర్యాప్తుకు ఆదేశాలు జారీచేసింది.


ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా(Australia Vs West Indies) టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే, టీ20 మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. అయితే ఇంతలోనే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు.మాజీ పేస‌ర్ బ్రెట్ లీ(Brett Lee) స‌భ్యుడిగా ఉన్న‌ ‘సిక్స్ అండ్ అవుట్’ బ్యాండ్ అడిలైడ్‌లో నిర్వ‌హించిన క‌న్స‌ర్ట్‌లో మ్యాక్స్‌వెల్ పాల్గొన్నాడు. అక్క‌డ ఆల్క‌హాల్ ఎక్కువ‌గా సేవించాడ‌ట‌. దాంతో, కాసేపటికే అంబులెన్స్‌లో ఈ స్టార్ బ్యాట‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  క్రమశిక్షణ చర్యల్లో భాగంగా  మ్యాక్సీని వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌కు ప‌క్క‌న‌పెట్టార‌ని స‌మాచారం.  అయితే వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో మాక్స్‌వెల్‌‌కు అవకాశం కల్పిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అడిలైడ్‌లో జరిగిన సంఘటన బోర్డు దృష్టిలోకి వచ్చిందని,  దానిపై పూర్తి సమాచారాన్నికోరామనీ , అయితే  దాని గురించి వన్డే జట్టులో మాక్సీని పక్కన పెట్టలేదని . బిగ్ బాష్ లీగ్‌తో పాటు అతడు పని ఒత్తిడి గురించి ఆలోచిస్తూ ఈ నిర్ణయం తీసుకుతెలిపింది. మాక్స్‌వెల్ టీ20 సిరీస్‌లోకి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నామని తెలిపింది.


ఇదిలా ఉంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌కు నేడు జ‌ట్టును ప్రక‌టించింది. రెగ్యుల‌ర్ కెప్టెన్ క‌మిన్స్‌కు విశ్రాంతి ఇచ్చారు. స్టీవ్‌స్మిత్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మాక్స్‌వెల్‌తో పాటు జే రిచ‌ర్డ్‌స‌న్‌ల వేటు వేశారు. జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌, గ్జావియ‌ర్ బార్ట్‌లెట్‌ల‌ను అవ‌కాశం క‌ల్పించారు. 


ప్రపంచ కప్ లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఆండ్రూ స్ట్రాస్ పేరిట ఉండేది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో భారత్ పై స్ట్రాస్ చేసిన 158 పరుగుల రికార్డు బద్ధలైంది. ఆపై ఇన్నింగ్స్ 47వ ఓవర్లో 195 వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ అయ్యాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో జరిగిన వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ 193 పరుగుల వద్ద రనౌటయ్యాడు. కానీ ఆ మ్యాచ్ లో పాక్ ఓటమిపాలైంది. కాగా, మ్యాక్సీ తాజా ఇన్నింగ్స్ కు ముందు ఫకర్ జమాన్ 193 రన్స్ వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. ఈ జాబితాలో షేన్ వాట్సన్ (185) మూడో స్థానంలో ఉన్నాడు. 2005లో శ్రీలంకపై ఎంఎస్ ధోనీ (183), 2012లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ (183) ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.


ఓవరాల్ గా చూస్తే.. వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మ్యాక్స్ వెల్. వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో సైతం ఛేదనలో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్సీదే కావడం విశేషం.