Jasprit Bumrah T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో బౌలర్ల హవా నడుస్తోంది. ఇక టీం ఇండియా నుంచి ప్రత్యర్థి జట్లను వణికిస్తున్న బౌలర్ బుమ్రా(Jasprit Bumrah) గురించి ఇక చెప్పనవసరమే లేదు. ప్రతి మ్యాచ్‌లో భారత్‌కు కీలక విజయాన్ని అందిస్తున్నాడు ఈ సీనియర్ పేసర్. ఇప్పటికవరకు జరిగిన అన్నీ మ్యాచ్ లలోనూ ముఖ్యమైన వికెట్లు తీసి అద్భుతాలే చేశాడు. దాయాది జట్టు తో జరిగిన పోరులో బంతితో చెలరేగిన బుమ్ర అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ నేపధ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) కీలక వ్యాఖ్యలు చేశాడు.
మొత్తం భారత క్రికెట్ జట్టు బుమ్రా విషయంలో ఓ ప్రత్యేక వైఖరిని అవలంబిస్తోంది అని చెప్పాడు. బుమ్రా విషయంలో అసలు బౌలింగ్ కోచ్ కూడా జోక్యం చేసుకోడట.. అందుకే ఈ పేసర్ స్వేచ్ఛగాతన వ్యూహాలను అమలుచేస్తాడట. తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలి, టెక్నిక్స్ తో ప్రత్యర్ధులను దెబ్బ తీస్తాడు కాబటీ ఏ ప్లేయర్ కూడా బుమ్రాతో బౌలింగ్ విషయంలో పెద్ద చర్చ చేయరని, ప్లేయర్లే కాదు అసలు బౌలింగ్ కోచ్, హెడ్ కోచ్ కూడా ఇలా చేయి, అలా వెయ్యి అనే సలహాలు ఇవ్వరని, అలా చేస్తే బుమ్రాలో కన్ఫ్యూజన్ పెరుగుతుందని అందుకే ఆ ఛాన్స్ తీసుకోరన్నాడు. బుమ్రాను పూర్తిగా నమ్మి, అతన్ని ఫ్రీగా వదిలేస్తారని చెప్పాడు.
బుమ్రా జట్టుకి బలం
బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ జట్టు ఉండటం ఎల్లప్పుడూ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు అక్షర్. ప్రస్తుతానికి బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ చాలా బలంగా ఉందని, బుమ్రా లాంటి బౌలర్ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తే ఇటువైపు నుంచి బ్యాటర్ లు దంచి కొట్టడానికి అవకాశం ఉంటుందన్నాడు.
సూపర్-8ను టీం ఇండియా అద్భుత విజయంతో మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 181 పరుగులు చేయగా.. అఫ్గాన్ 134 పరుగులకే కుప్పకూలి 47 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసిన ఒక మెయిడిన్‌తో ఏడు పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.