IND Vs ENG 1st Test :భారత్‌తో జరుగుతున్న హెడింగ్లీ టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ రికార్డు సృష్టించాడు. హెడింగ్లీలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్ సెంచరీకిపైగా స్కోర్ చేసిన గత 10 సంవత్సరాలలో డకెట్ తొలి ఇంగ్లీష్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇలాంటి ఘనతను 2015లో అలెస్టర్ కుక్ సాధించాడు.
మ్యాచ్ అంతటా అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు బెన్‌డకెట్. మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను మరో అద్భుతమైన సెంచరీతో రాణించాడు. 170 బంతుల్లో 149 పరుగులు సాధించాడు.
ఈ ప్రదర్శనతో, గత 30 సంవత్సరాలలో ఈ వేదికపై ఒక టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 50కిపైగా పరుగులు సాధించిన రెండో ఇంగ్లీష్ ఓపెనర్‌గా కూడా అతను నిలిచాడు. మాజీ కెప్టెన్ కుక్‌తో ఎలైట్ క్లబ్‌లో చేరాడు.
ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే మరో రికార్డు నెలకొల్పారు. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఈ జంట కమాండింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నాలుగు దశాబ్దాలుగా ఈ వేదికపై ఇలాంటి భాగస్వామ్యం కనిపించలేదు.
4వ ఇన్నింగ్స్‌లో 41 సంవత్సరాల తర్వాత సెంచరీ భాగస్వామ్యం
డకెట్, క్రాలే ఇంగ్లాండ్‌కు గట్టి పునాది వేయడమే కాకుండా, 1984 తర్వాత హెడింగ్లీలో నాల్గో ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి ఇంగ్లీష్ ఓపెనింగ్ జతగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు డెస్మండ్ హేన్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్ పేరు మీద ఉండేది. ఆ జోడీ 106 పరుగుల భాగస్వామ్యమే నేటికీ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు డకెట్, క్రాలే ఓపెనింగ్ జోడీ 188 భాగస్వామ్యంతో పాత రికార్డును తిరగరాశారు.
డకెట్ దూకుడు, క్రాలే సమన్వయంతో ఆడటంతో వీళ్లద్దరు ఉన్నంత వరకు వికెట్లు తీయడం భారత బౌలర్లకు సవాలుగా మారింది. ఎన్ని రకాలుగా బౌలింగ్ మార్పులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 188 పరుగుల వద్ద క్రాలే రూపంలో తొలి వికెట్ భారత్‌కు దక్కింది. ఈ వికెట్‌ను ప్రసిద్ధ కృష్ణ తీసుకున్నాడు. తర్వాత వచ్చిన ఓలీని కూడా కాసేపటికే కృష్ణ పెవిలియన్ పంపించాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న బెన్ డకెట్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. తర్వాత వచ్చిన హారీ బ్రూక్ శార్దూల్ ఠాకూర్ తొలి బంతికే అవుట్ చేయడంలో టీ బ్రేక్‌కు ముందు నాలుగ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టీం 269 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 102 పరుగుల చేయాల్సి ఉంది. వారి చేతులో ఆరు వికెట్లు ఉన్నాయి.