ఇంగ్లండ్(England)తో టీమిండియా(Team India) టెస్టు సిరీస్‌కు ముందు.. వామప్ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(The Board of Cricket Control for India) BCCI భారత్ ఏ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడేందుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 12- 20 మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇంగ్లండ్ లయన్స్-భారత్-‘ఏ’ జట్టుతో ఈ మేరకు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 12 నుంచి 13 వ తేదీ వరకు నరేంద్ర మోఢీ స్టేడియంలో రెండు రోజుల వామప్ మ్యాచ్ జరగనుండగా... జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు అదే స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది.
భారత్-‘ఏ’ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పుజారా వస్తాడా
ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు.. తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు పుజారా గట్టి సందేశం ఇచ్చాడు. దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజరా సత్తా చాటాడు. ఈ నయా వాల్ భారీ శతకంతో సెలక్టర్లకు హెచ్చరికలు పంపాడు. కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పుజారా... జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీని ఘనంగా ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా..తొలి మ్యాచ్‌లోనే భారీ శతకంతో చెలరేగాడు.
నయా వాల్ భారీ శతకం
రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో పుజారా సెంచరీతో మెరిశాడు. పుజారా డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు.
జార్ఖండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది. జార్ఖండ్ 142 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్ చిరాగ్ జాని ఐదు వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్ హర్విక్ దేశాయ్ 85 పరుగులు సాధించి శుభారంభం అందించాడు. వన్‌డౌన్ బ్యాటర్ షెల్డన్ జాక్సర్ కూడా అర్ధ శతకం.. అర్పిత్ వసవాడ 68 పరుగులు చేశారు. పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. ప్రేరక్ మన్కడ్ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.