BCCI Monthly Pension To Ajinkya Rahane: అజింక్యా రహానే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ అనౌన్స్ చేయడంతో బిసిసిఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ స్కీమ్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టి20లు ఆడిన రహానే బిసిసిఐ ఇచ్చే హయ్యెస్ట్ పెన్షన్ బ్రాకెట్ కి ఎలిజిబుల్ అయ్యాడు. వరల్డ్ స్పోర్ట్స్ లో ఏ క్రికెట్ బోర్డు ఇవ్వని విధంగా మాజీ ప్లేయర్లకు ప్రతీ నెలా పెన్షన్ ఇవ్వడం ఒక రేర్ ఇనీషియేటివ్. ఈ పెన్షన్ స్కీమ్‌ను బిసిసిఐ దాదాపు 20 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేసింది.
2004 లో స్టార్ట్ అయిన స్కీమ్.. రూ. 5 వేల నుంచి నేటి పెన్షన్ దాకాతాజా రిపోర్ట్ ప్రకారం బిసిసిఐ ఈ పెన్షన్ స్కీమ్‌ను ఏప్రిల్ 2004 లో ప్రవేశపెట్టింది. ఆ టైమ్ లో 174 మంది మాజీ ప్లేయర్లు, అఫీషియల్స్‌కు నెలకు రూ. 5,000 చొప్పున పెన్షన్ ఇచ్చేవారు. అప్పట్లో కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకే ఈ మంత్లీ పెన్షన్ పొందే అర్హత ఉండేది. జూన్ 2022 లో బిసిసిఐ మాజీ క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్ అమౌంట్ ని భారీగా పెంచింది. "మాజీ, ప్రెజెంట్ క్రికెటర్ల సంక్షేమమే మా ఫస్ట్ ప్రయారిటీ" అని అప్పటి బిసిసిఐ సెక్రటరీ జే షా చెప్పాడు. దాదాపు 900 మందికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందింది.
ప్రెజెంట్ బిసిసిఐ పెన్షన్ అమౌంట్ డీటైల్స్.. ఎవరికి ఎంత వస్తుందంటేప్రస్తుత రూల్స్ ప్రకారం 25 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన సీనియర్ టెస్ట్ క్రికెటర్లకు నెలకు రూ. 70,000 పెన్షన్ లభిస్తుంది. మిగిలిన మాజీ టెస్ట్ ప్లేయర్లకు రూ. 60,000 దక్కుతుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్లకు నెలకు రూ. 52,500 ఇస్తారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి 2003 కంటే ముందు రిటైర్ అయిన వారికి రూ. 45,000, ఇతర ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు రూ. 30,000 చొప్పున ప్రతీ నెలా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
లైఫ్ టైమ్ పెన్షన్ వస్తుందా.. తాత్కాలిక బ్రేక్ పడేది ఎప్పుడంటేఈ పెన్షన్ స్కీమ్ లైఫ్ టైమ్ కంటిన్యూ అవుతుంది. అయితే రిటైర్ అయిన ప్లేయర్ బిసిసిఐ లో లేదా స్టేట్ అసోసియేషన్ లో నేషనల్ కోచ్, సెలెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటర్ గా జీతం తీసుకునే అఫీషియల్ రోల్ లోకి వస్తే మాత్రం ఆ పీరియడ్ లో పెన్షన్ తాత్కాలికంగా ఆగుతుందని బిసిసిఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
