Sachin Received Award: క్రికెట్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లను శనివారం వివిధ అవార్డులతో సత్కరించింది. బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవం పేరిట ఈ అవార్డులను అందించారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. దీన్నే కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ పేరుతో అందించారు. క్రికెట్ ప్రపంచంలో చాలా రికార్డులను సచిన్ పేరిటే ఉన్న సంగతి తెలిసిదే. 2013లో తను రిటైర్ అయినప్పటికీ, చాలావరకు రికార్డులు ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. ఇక పేస్ సంచలనం, జస్ ప్రీత్ బుమ్రాను బెస్ట్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద అవార్డు వరించింది. అలాగే మహిళల విభాగంలో బెస్ట్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డను స్మృతి మంధానకు లభించింది. పలువురు క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై అవార్డులు స్వీకరించారు. ఇంటర్నేషనల్ నుంచి అండర్ -16 వరకు వివిధ రకాల విభాగాలకు అవార్డులను బీసీసీఐ అందించింది. 

2023-24కు సంబందించిన బీసీసీఐ ప్రకటించిన అవార్డుల జాబితా ఇదే..సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు - సచిన్‌పాలి ఉమ్రిగర్‌ అవార్డు - ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌ - బుమ్రాఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌: స్మృతి మంధానఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు): సర్ఫరాజ్‌ ఖాన్‌ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు): ఆశా శోభనాబీసీసీఐ స్పెషల్‌ అవార్డు: రవిచంద్రన్‌ అశ్విన్‌వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌: స్మృతి మంధానవన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌ : దీప్తి శర్మదేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్‌: అక్షయ్‌ తోట్రేఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ - కావ్యా ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌ - విష్ణు భరద్వాజ్‌జగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ- బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్‌ సీనియర్‌ డొమెస్టిక్‌: ప్రియా మిశ్రాజగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ- బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్‌ జూనియర్‌ డొమెస్టిక్‌: ఈశ్వరీ అవసరేజగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ-U16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: హెచ్‌. జగన్నాథన్‌జగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ-U16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: లక్ష్య రాయ్‌చందానీఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: నీజెఖో రుప్రియోఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: హేమ్‌ ఛెత్రిఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: పి. విద్యుత్‌ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: కేవీ అనీశ్‌మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌)- అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: తనయ్‌ త్యాగరాజన్‌మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌)- అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: ఆర్‌. సాయి కిశోర్‌మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌)- అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: అగ్ని చోప్రామాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌)- అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌- రికీ భూయ్‌ లాలా అమర్‌నాథ్‌ అవార్డు- బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (డొమెస్టిక్‌ లిమిటెడ్‌ ఓవర్స్‌ కాంపిటీషన్‌)-శశాంక్‌సింగ్‌లాలా అమర్‌నాథ్‌ అవార్డు- బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (రంజీ ట్రోఫీ)-తనుశ్‌ కోటియన్‌బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇన్‌ బీసీసీఐ డొమెస్టిక్‌ టోర్నమెంట్స్‌: ముంబయి

Also Read:Sports Budget 2025-26: ఖేలో ఇండియాకు భారీగా కేటాయింపులు.. గతేడాదితో పోలిస్తే క్రీడాలకు తోడ్పాటు.. ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా..