Team India Matches Schedule | న్యూఢిల్లీ: ఓవైపు భారత్ లో ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. మరోవైపు ఐపీఎల్ అనంతరం భారత క్రికెట్ జట్టు పర్యటనులు, సిరీస్ ల షెడ్యూళ్లను బీసీసీఐ విడుదల చేస్తోంది. తాజాగా భారత క్రికెట్ పురుషుల జట్టు బంగ్లాందేశ్ టూర్ ఖరారు చేసింది. మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లు ఆడేందుకు భారత జట్టు బంగ్లాందేశ్ పర్యటనకు వెళ్లనుంది. 

బీసీసీఐ తాజాగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. భారత క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఆగస్టు 17న తొలి వన్డే మీర్పూర్ వేదికగా ఆడనుంది. ఆగస్టు 20వ తేదీన మీర్పూర్ వేదికగానే రెండో వన్డే బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి. ఆగస్టు 23న చివరిదైన మూడో వన్డే చిట్టగాంగ్ వేదికగా జరగనుంది.

టీ20 సిరీస్ విషయానికొస్తే.. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 ఆగస్టు 26న జరగనుంది. చిట్టగాంగ్ వేదికగానే తొలి టీ20 నిర్వహించనున్నారు. ఆగస్టు 29న రెండో టీ20 మ్యాచ్, ఆగస్టు 31న మూడో టీ20 మ్యాచ్ లు మీర్పూర్ వేదికగా జరగనున్నాయి. ఈ మేరకు భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన వివరాలు బీసీసీఐ విడుదల చేసింది.

అక్టోబ‌ర్ నుంచి Team India వరుస సిరీస్ లతో బిజీగా ఉండనుంది. టీమిండియా హోం సీజన్ లో భాగంగా ఒక టీ20 విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతుంది. ఇండియా, సౌతాఫ్రికాల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ కు సాగ‌ర న‌గ‌రం విశాఖపట్నం వేదికైంది. అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు టీమిండియా హోం సీజన్ సిరీస్ ల షెడ్యూల్‌ను  బీసీసీఐ ఇటీవల జూన్ లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికాల‌తో టీమిండియా సొంత గడ్డపై మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది. 

 అహ్మ‌దాబాద్ లో వెస్టిండీస్ తో జ‌రిగే తొలి టెస్టుతో సొంతగడ్డపై టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభ‌మ‌వుతాయి. అక్టోబ‌ర్ 2 నుంచి 6 వ‌ర‌కు తొలి టెస్టు, అదేనెల 10 నుంచి 14 వరకు కోల్ క‌తా వేదికగా రెండో టెస్టు ఆడనుంది. కాస్త విరామం త‌ర్వాత ఇండియాలో సౌతాఫ్రికాతో సిరీస్ మొద‌లు కాబోతోంది. 2 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20లు ఆడ‌నున్నాయి. 

ఆస్ట్రేలియాలో పర్యటన

టీమిండియా అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మొదట డే నైట్ వన్డే సిరీస్ ఆడనున్నాయి. అక్టోబర్ 19న పెర్త్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేలో తలపడనున్నాయి. అక్టోబర్ 23న ఆడిలైడ్ లోని ఓవల్ లో రెండో వన్డే, అక్టోబర్ 25న సిడ్నీలో మూడో వన్డే షెడ్యూల్ చేశారు.

టీ20 సిరీస్..అక్టోబర్ 29న కాన్ బెర్రా వేదికగా తొలి టీ20లో తలపడనున్నాయి. అక్టోబర్ 31న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో టీ20, నవంబర్ 2న హోబర్ట్ వేదికగా మూడో టీ20, నవంబర్ 6న కోల్డ్ కోస్ట్ స్టేడియంలో నాలుగో టీ20, నవంబర్ 8వ తేదీన బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో 5వ టీ20 జరగనున్నాయి.