Tim David: ఆస్ట్రేలియా, విండీస్ మద్య జరుగుతున్న T20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో అద్భుతవిజయం సాధించింది ఆసీస్. టిమ డేవిడ్ రికార్డుస్థాయిలో కొట్టిన సెంచరీ ఇన్నింగ్స్‌కే హైలైట్. 37 బంతుల్లోనే సెంచరీ చేసిన సెయింట్ కిట్స్‌లో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
కేవలం 37 బంతుల్లోనే 11 సిక్సర్లు బాది తన తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు డేవిడ్. వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసినప్పటికీ ఆస్ట్రేలియా ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత ఒత్తిడిలో ఉన్న ఆసిస్‌కు టిమ్ డేవిండ్ అండగా నిలబడ్డాడు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సునామీ సృష్టించాు. డేవిడ్ -ఓవెన్ (16 బంతుల్లో 36 పరుగులు) ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించి 17వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేరుకుంది.
డేవిడ్ సెంచరీ విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలి T20 అంతర్జాతీయ సెంచరీని కమ్మేసింది. క్రిస్ గేల్ తర్వాత మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన రెండో ఆటగాడు అయ్యాడు. జోష్ ఇంగ్లిస్ (43 బంతులు) ఆస్ట్రేలియా తరపున గతంలో చేసిన వేగవంతమైన T20 సెంచరీని ఆరు బంతుల తేడాతో బద్దలు కొట్టాడు డేవిడ్. రొమారియో షెపర్డ్ (2-39) బౌలింగ్‌లో బంతిని ఫైన్ లెగ్ వద్ద ప్లిక్‌చేసి తొలి సెంచరీ చేశాడు.
పురుషుల T20I లలో ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసింది వీళ్లే
- 37 బంతులు - టిమ్ డేవిడ్ v వెస్టిండీస్ 2025
- 43 - జోష్ ఇంగ్లిస్ v స్కాట్లాండ్ 2024
- 47 - ఆరోన్ ఫించ్ v ఇంగ్లాండ్ 2013
- 47 - జోష్ ఇంగ్లిస్ v ఇండియా 2023
- 47 - గ్లెన్ మాక్స్వెల్ v ఇండియా 2023
డేవిడ్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ వేసిన ఓ ఓవర్‌లో 28 పరుగులు రాబట్టాడు. అందులో నాలుగు సిక్స్‌లు కొట్టాడు. అక్కడి నుంచి పూనకం వచ్చినట్టు ఆడాడు. అకేల్ జెరోమ్ హోసేన్‌ను మిడ్‌వికెట్‌పై కొట్టిన భారీ సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్. ముందు బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు కెప్టెన్ హోప్ కూడా ఈ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ డేవిడ్ సెంచరీతో అది పక్కకుపోయింది.57 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను ఆస్ట్రేలియా కలిగి ఉంది - షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, జోష్ ఇంగ్లిస్, బెత్ మూనీ ఈ ఘనత సాధించారు.
ఈ సిరీస్‌లో హోప్, బ్రాండన్ కింగ్ వరుసగా రెండో అర్ధ సెంచరీలు నమోదు చేశారు. విండీస్ కెప్టెన్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. తర్వాత దాన్ని సెంచరగా మలుచుకున్నాడు. పది ఓవర్లకు వికెట్లు ఏమీ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. మిచ్ ఓవెన్ (1-23) 125 పరుగుల వద్ద ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కింగ్ ఏడో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి అబాట్ చిక్కాడు. మరోవైపు హోప్ మాత్రం ధాటిగా ఆడాడు. ఆడమ్ జంపా వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది 19 పరుగులు రాబట్టాడు.
19వ ఓవర్‌లో బెన్ డ్వార్షుయిస్ బౌలింగ్‌లో హోప్ సింగిల్ తీసి తొలి T20 అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. కానీ నాథన్ ఎల్లిస్ (1-37) తన చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతే కాకుండా రోవ్‌మన్ పావెల్ వికెట్‌ను కూడా తీసుకున్నాడు. దీంతో వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా ఆఖరి ఓవర్లలలో కట్టడి చేయగిగలిగింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో మాక్స్వెల్ వరుసగా రెండో మ్యాచ్ కు ఓపెనర్ గా వచ్చాడు. తొలి ఓవర్‌లోనే అరంగేట్ర ఆటగాడు జెడియా బ్లేడ్స్ వేసిన బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టారు. మొదట్లో బాగానే ఆడిన తర్వాత ఆసీస్ బ్యాటింగ్ లయతప్పింది. దీంతో వారు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అప్పుడు ఐదో బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగాడు డేవిడ్. మొదట్లో నెమ్మదిగా ఆడుతూ గేర్ మార్చాడు. మొదటి పిఫ్టీని కేవలం 16 బంతుల్లో చేసిన డేవిడ్, తర్వాత మరో 20 బంతుల్లో మిగతా 50 కొట్టేసి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులు బ్రేక్ చేశాడు.
వెస్టిండీస్‌లో ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఇదే.
- మొదటి T20I: ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది
- రెండవ T20I: ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది
- మూడవ T20I: ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది
- నాల్గవ T20I: జూలై 26, బస్సెటెర్రే, సెయింట్ కిట్స్
- ఐదవ T20I: జూలై 28, బస్సెటెర్రే, సెయింట్ కిట్స్