ACC Confirms Asia Cup 2025 Venue: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుందని తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్‌లో దాయాది దేశాలు భారత్- పాకిస్తాన్ సైతం తలపడనున్నాయి. ఆసియా కప్ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితమే విడుదలైంది. ఇందులో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న నిర్వహించనున్నారని ఏసీసీ వెల్లడించింది. ఇప్పుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) షెడ్యూల్ తర్వాత వేదికలను కూడా ఖరారు చేసింది. ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబితో పాటు దుబాయ్ వేదికగా జరుగుతాయి. UAEలో ఆసియా కప్ నిర్వహించడంపై ఇప్పటికే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ACC ప్రకటనతో దీనికి ఆమోదం లభించినట్లు అయింది
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్‌పై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ACC ఈ మ్యాచ్ వేదిక వివరాలను కూడా విడుదల చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ దుబాయ్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అదే సమయంలో, భారత్ ఈ టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను దుబాయ్‌లో UAEతో సెప్టెంబర్ 10న ఆడనుందని ఏసీసీ స్పష్టం చేసింది.
భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పై తీవ్ర వివాదం
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భారత దిగ్గజ ఆటగాళ్లు పాకిస్తాన్ టీంతో ఆడేందుకు నిరాకరించారు. దాంతో సెమీఫైనల్లో పాక్ ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత క్రికెట్ అభిమానులు రెండుగా విడిపోయారు. ఒక వర్గం భారత్, పాకిస్తాన్‌తో ఆసియా కప్‌లో కూడా ఆడకూడదని డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో, కొందరు పాకిస్తాన్‌తో ఆడి విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు. తప్పు చేసింది పాకిస్తాన్ కనుక.. వాళ్లే సిరీస్, టోర్నీల నుంచి తప్పుకోవాలి కానీ భారత్ ఆ పని చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే ఆడకపోతే ICC ర్యాంకింగ్‌లో భారత్ స్థానం దిగజారిపోవచ్చు, ఇది ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ స్థానంలో పాకిస్తాన్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం లభిస్తుంది.
ఇది కూడా చదవండి
IND vs PAK match : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ బహిష్కరిస్తాం, ఆసియా కప్‌పై అభిమానుల ఆగ్రహం