IND vs PAK Match in Asia Cup 2025: 025 ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో బిగ్ మ్యాచ్ ఆదివారం జరిగింది. పాకిస్తాన్‌తో భారత్ తలపడింది. మెన్ ఇన్ బ్లూ జట్టు తమ ప్రధాన ప్రత్యర్థులపై అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది, వారిని తక్కువ స్కోరుకే అవుట్ చేసింది. ఆపై ఎక్కువ కష్టపడకుండానే లక్ష్యాన్ని ఛేదించింది.

భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ భారత బ్యాట్స్‌మెన్‌లలో అత్యధిక పరుగులు సాధించాడు, 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు. సిక్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు.  

IND vs PAK: ఆసియా కప్ అప్‌డేట్ చేసిన పాయింట్ల పట్టిక (గ్రూప్ A)

భారతదేశం - ఆడిన మ్యాచ్‌లు: 2 | సాధించిన విజయాలు: 2 | ఓడిన మ్యాచ్‌లు: 0 | టై అయిన మ్యాచ్‌లు: 0 | మొత్తం పాయింట్లు: 4 | నెట్‌రన్‌రేట్‌: +4.793

పాకిస్తాన్ - ఆడిన మ్యాచ్‌లు: 2 | సాధించిన విజయాలు:  1 | ఓడిన మ్యాచ్‌లు: 1 | టై అయిన మ్యాచ్‌లు: 0 | మొత్తం పాయింట్లు:  2 | నెట్‌రన్‌రేట్‌: +1.649

ఒమన్ - ఆడిన మ్యాచ్‌లు:1 | సాధించిన విజయాలు:  0 | ఓడిన మ్యాచ్‌లు: 1 | టై అయిన మ్యాచ్‌లు: 0 | మొత్తం పాయింట్లు: 0 | నెట్‌రన్‌రేట్‌: -4.650

UAE - ఆడిన మ్యాచ్‌లు:1 | సాధించిన విజయాలు: 0 | ఓడిన మ్యాచ్‌లు: 1 | టై అయిన మ్యాచ్‌లు: 0 | మొత్తం పాయింట్లు:  0 | నెట్‌రన్‌రేట్‌: -10.483

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ ఏడాది ఆసియా కప్‌లో కుల్దీప్ యాదవ్ వరుసగా రెండోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతను నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించడంలో అతను, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు, పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ వచ్చారు. 

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి అభిషేక్ శర్మ ఎప్పటిలాగే అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్‌మాన్ గిల్ కూడా మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు, కానీ చాలా త్వరగా అవుట్ అయ్యాడు. 

అయినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మిగా పని పూర్తి చేశారు. వారి భాగస్వామ్యం భారతదేశాన్ని విజయం దిశగా నిడిపించింది. ఆఖరిలో తిలక్ వర్మ అవుట్ అయినప్పటికీ, మిగతా పనిని కెప్టెన్ ముగించేశాడు.  

టీ మిండియా ఈ శుక్రవారం సెప్టెంబర్ 19, 2025న అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఒమన్‌తో తలపడుతుంది. పాకిస్తాన్ సెప్టెంబర్ 17న, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యుఎఇతో తలపడుతుంది.