ముంబై: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన దేశంలో పలు గేమ్ యాప్‌లు, గేమ్ బెట్టింగ్ యాప్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. డ్రీమ్11 టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వైదొలిగింది. బీసీసీఐతో చర్చించిన తరువాతే డ్రీమ్ 11 ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో BCCI కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతోంది. 2025 నుంచి 2028 వరకు 3 సంవత్సరాలకుగానూ రూ.450 కోట్ల ఒప్పందం కోసం బీసీసీఐ బోర్డు చూస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.

Continues below advertisement


స్పాన్సర్‌షిప్ వివరాలు ఇవే


పలు మీడియా కథనాల ప్రకారం, ద్వైపాక్షిక సిరీస్, డొమెస్టిక్, విదేశీ మ్యాచ్‌లు, అలాగే ICC, ACC టోర్నమెంట్‌లతో సహా 140 మ్యాచ్‌లను ఈ డీల్ ఉంటుందని BCCI భావిస్తోంది. బోర్డు ఒక్కో ద్వైపాక్షిక మ్యాచ్‌కు సుమారు ₹3.5 కోట్లు, ఒక్కో ICC/ ACC మ్యాచ్‌కు రూ.1.5 కోట్లు లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.


డ్రీమ్11 నుంచి పెద్ద డీల్ వరకు


గతంలో డ్రీమ్11 జూలై 2023 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ₹358 కోట్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందంలో ఉంది. అయితే కొత్త గేమింగ్ చట్టం డ్రీమ్11 వంటి మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ కార్యకలాపాలు నిలిపివేయవలసి వచ్చింది.


ఆసియా కప్ 2025 ప్రశ్నార్థకం


సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. కానీ BCCI కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయడానికి తక్కువ టైం ఉంది. ఒకవేళ డీల్ త్వరగా కుదరకపోతే, ఇండియా జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే టోర్నమెంట్‌లో ఆడవలసి ఉంటుంది.


బీసీసీఐపై ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రభావం


ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీసీసీఐకి జెర్సీ స్పాన్సర్ నుంచి డ్రీమ్11 వైదొలిగింది. రియల్ మనీ గేమింగ్‌ను పరిమితం చేసే ఈ చట్టం, డ్రీమ్11 వంటి ప్లాట్‌ఫారమ్‌లను భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేసేలా చేసింది. తద్వారా టీమ్ ఇండియాతో జెర్సీ కాంట్రాక్ట్ మధ్యలోనే ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది.


డ్రీమ్11తో గత స్పాన్సర్‌షిప్ ఒప్పందం ₹358 కోట్లు కాగా, ఇది జూలై 2023 నుండి మార్చి 2026 వరకు ఉన్నా రద్దు చేసుకున్నారు. డ్రీమ్11 స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో  BCCI వచ్చే 3 సంవత్సరాలకు పెద్ద స్పాన్సర్‌షిప్ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది, సుమారు ₹450 కోట్లు లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.


సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ప్రారంభం కానున్నందున, కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయడానికి అంత టైం లేదు. ఒకవేళ ఒప్పందం వెంటనే కుదరకపోతే, ఆసియా కప్ టోర్నమెంట్‌లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు ఆడే అవకాశం ఉంది. గత కొన్ని దశాబ్దాలలో ఇది భారత క్రికెట్ చరిత్రలో అరుదైన విషయంగా చెప్పవచ్చు. ప్రపంచ క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురిపించిన బీసీసీఐకి జెర్సీ స్పాన్సర్ లేకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది.