టీ20 క్రికెట్ లో పెను సంచలనం నమోదైంది. పురుషులకే సాధ్యంకాని అరుదైన రికార్డ్ ను మహిళల జట్టు నమోదు చేసింది. చిలీతో జరిగిన మ్యాచ్లో ఆర్జెంటినా రికార్డుల ఊచకోత కోసింది. అవి మాములు రికార్డులు కాదు. ఇక భవిష్యత్తు లో నమోదు కావడం దాదాపు అసాధ్యమైన రికార్డులను ఆర్జెంటినా మహిళల జట్టు సృష్టించింది... టీ20 క్రికెట్లో 427 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి అద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలి వికెట్కు 350 పరుగుల భాగస్వామ్యంతో టేలర్. గలాన్ విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవర్ లో 17 నో బాల్స్ వేసిన చీలీ బౌలర్ఆ ఓవర్లో 52 పరుగులు సమర్పించింది.
అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో రీతిలో ఓ బాదు బాదేసినది. ఏకంగా 427 పరుగులు చేసిటీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి. టీ20 పొట్టి ఫార్మాట్‌లో 250 స్కోరు చేస్తేనే అద్భుతం అనుకుంటాం. అలాంటిది అర్జెంటీనా మహిళా జట్టు ఏకంగా 427/1 స్కోరు చేసింది. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అర్జెంటీనా, చిలీ మహిళల జట్ల మధ్య 3 మ్యాచ్‌లు టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం రెండు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒకే ఒక వికెట్ కోల్పోయి ఏకంగా 427 పరుగులు చేసింది. అమ్మాయిలు లూసియా టేలర్, ఆల్బర్టినా గలాన్ పరుగుల వర్షం కురిపించారు. లూసియా టేలర్ 84 బంతుల్లో 169 పరుగులు చేయగా, గలాన్ 84 బంతుల్లో 145 (నాటౌట్) పరుగులు సాధించింది. టేలర్ 27 ఫోర్లు, గలాన్ 23 ఫోర్లు కొట్టారు. భారీ సెంచరీలతో చెలరేగిన లూసియా టేలర్, అల్బెర్టినా గలాన్ కూడా కనీసం ఒక సిక్సు కూడా కొట్టకుండానే ఇంత విధ్వంసం సృష్టించడం విశేషం.
ఇప్పటివరకు లూసియా టేలర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇప్పటివరకు 29 పరుగులే. అయితేనేం చిలీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ టేలర్ మూడంకెల స్కోరు నమోదు చేసింది. సెంచరీతో రెచ్చిపోయిన ఓపెనర్ లూసియా టేలర్(169, 84 బంతుల్లో 27 ఫోర్లు) టీ20ల్లో వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోరును నమోదు చేసింది.
ఈ మ్యాచ్ తో ఇదే కాదు అత్యధిక స్కోర్ పరంగా ఇప్పటివరకు ఉన్న ప్రపంచ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో 427 పరుగులు చేసిన అర్జెంటీనా.. పొట్టి ఫార్మాట్లో 400కు పరుగులు చేసిన తొలి జట్టుగా అవతరించింది. గతేడాది సౌదీ అరేబియాపై బహ్రెయిన్ చేసిన 318 పరుగుల రికార్డును తుడిచిపెట్టింది. పురుషుల టీ20 క్రికెట్లో కూడా ఇంత స్కోరు ఏ జట్టు సాధించలేకపోయింది. పురుషుల టీ20 క్రికెట్లో హయ్యస్ట్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. గత నెలలోనే నేపాల్ జట్టు మంగోలియాపై 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు అర్జెంటీనా ఓపెనర్లు లూసియా టేలర్, అల్బెర్టినా గలాన్ 350 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరు ప్రపంచరికార్డు నెలకొల్పారు. ఈ రకంగా కూడా అర్జెంటీనా మహిళల జట్టు వీరబాదుడుతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పురుషుల క్రికెట్లోనూ, మహిళల క్రికెట్లోనూ ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతేకాదు, ఓ టీ20 మ్యాచ్ ల్లో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయడం కూడా ఇదే ప్రథమం. మొత్తంగా ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడిగా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్ లో చిలీ బౌలర్ ఫ్లోరెన్సియా మార్టినెజ్ పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక నో బాల్స్(64), అత్యధిక ఎక్స్‌ట్రా (73) పరుగులు సమర్పించుకున్న జట్టుగా చిలీ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చిలీ బౌలర్ ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒకే ఓవర్లో ఏకంగా 52 పరుగులు సమర్పించుకుంది.
చిలీ బ్యాటింగ్ లైనప్‌లో జెస్సికా మిరాండ(27) టాప్ స్కోరర్. ముగ్గురు సింగిల్ డిజిట్, ఐదుగురు ఖాతా కూడా తెరవలేదు. శనివారం జరిగిన రెండో టీ20లోనూ అర్జెంటీనా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 300 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో చిలీ 19 పరుగుల ఆలౌటవడంతో అర్జెంటీనా 281 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాకుండా, మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది.