Anand Mahindra Surprise to Sarfaraz Khan's Father: వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించడంలో  ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రాను(Anand Mahindra) మించినవారు లేరు. చెస్‌ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద ఫ్యామిలీకి ఇటీవల ఎలక్ట్రిక్ కారును బ‌హుమతిగా ఇచ్చిన ఆయన . తాజాగా టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి(Sarfaraz Khan Father) నౌషాద్ ఖాన్‌కు కూడా థార్ కారు(Thar Car )ను కానుకగా ఇచ్చారు. ఆనంద్ మ‌హీంద్రా కానుకగా పంపించిన థార్ కారుతో సర్ఫరాజ్ ఫ్యామిలీ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆనంద్ మ‌హీంద్రా నుంచి గిఫ్ట్ అందుకున్న సర్ఫరాజ్ ఫ్యామిలీకి నెటిజనులు అభినందలు తెలిపారు. 


టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్(Noushad Khan) ముంబయి తరపున రంజీ క్రికెట్ ఆడాడు. సరైన సపోర్ట్ లేక టీం ఇండియా తరపున ఆడలేకపోయారు. తన ఆ కలను కొడుకుల ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు. తనో రైల్వే ఉద్యోగి. ఆ చాలి చాలనీ జీతమంతా సర్ఫరాజ్ ఖాన్, ఇంకో ఇద్దరి కొడుకులను క్రికెట్ కోచింగ్  ఇప్పించారు. ఆ ముగ్గురు తన తండ్రి కలను.. తమ లక్ష్యంగా మలుచుకున్నారు. 


సర్ఫరాజ్ దేశ‌వాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు.  2019-20 రంజీ సీజన్‌లో సర్ఫరాజ్ ముంబైకి స్టార్ పెర్ఫార్మర్. అప్పటి నుండి, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 82.46 సగటుతో ఉన్నాడు. వరుసగా రెండు సీజన్లలో 900-ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ లో బెంగళూరు, పంజాబ్ వంటి టీమ్స్ కు ఆడాడు. ఇలా ఫ్రూవ్ చేసుకుంటున్నా..టీం ఇండియాలో చోటు కోసం 2ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఆ అవకాశం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో వచ్చింది. అరగేంట్ర మ్యాచ్ లో నే 62 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.  ఈ మట్టిలో మాణిక్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇలాంటి స్టార్ ని తయారు చేసిన తండ్రి నౌషద్ కు ఆనంద్ర మహీంద్రా థార్ కారు గిఫ్ట్ గా ఇస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  ఇప్పుడు దేశం మొత్తం సర్ఫరాజ్ ఖాన్ గురించి పొగుడుతుంటే .. ఈ క్షణాన నౌషద్ కంటే గర్వపడే వ్యక్తి ఎవరు ఉండరు. 


రాజ్‌కోట్‌లోని గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్యజరిగిన మూడో టెస్టు మ్యాచ్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశారు. 26 ఏళ్ల సర్ఫరాజ్ దేశవాళీలో రికార్డుల మోత మోగించి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌ 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 69.85 యావరేజ్‌తో 3912 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్‌ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో 161 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కొడుకులిద్దరినీ క్రికెటర్లుగా తయారు చేసిన నౌషాద్ ఖాన్‌కు ఆనంద్ మ‌హీంద్రా కారును బహుమతి ఇచ్చారు.  సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇదే సమయం అని నెటిజన్లు ఆనంద్ మహేంద్రాని మరో ప్రశ్న అదిగుతున్నారు.  సర్ఫరాజ్‌తో పాటు టెస్టుల్లో అరంగ్రేటం చేసిన యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌కు కూడా గిఫ్ట్ ఇవ్వాల కోరుతున్నారు. ధృవ్ జురెల్‌ తండ్రికి ఎప్పుడు గిఫ్ట్ పంపిస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.