Viral Video: ఔటై పెవిలియన్ కు వెళ్లిన బ్యాటర్ ని వెనక్కి పిలిచిన థర్డ్ అంపైర్.. అసలు తప్పెవరిదంటే..?
థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఫలితాన్ని తారుమారు చేసిన ఘటన రంజీ ట్రోఫీలో జరిగింది. అంపైర్ నిర్ణయం కారణంగా రహానేకు మరో లైఫ్ లభించింది.

Ranji Trophy News: రంజీట్రోఫీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై-జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవలిసి వచ్చింది. ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఉమర్ మిర్ వేసిన బంతికి ముంబై కెప్టెన్ అజింక్య రహానే ఔటయ్యాడు. అయితే అతను పెవిలియన్ కు వెళ్లిపోయాక, అతని స్థానంలో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. అతను బ్యాటింగ్ గార్డు తీసుకుంటున్న సమయంలో సడెన్ గా థర్డ్ అంపైర్ సీన్లోకి వచ్చాయి.
అంతకుముందు వేసిన బాల్ ను నో బాల్ గా తేల్చి, రహానేను తిరిగి వెనక్కి పిలువమని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఉమర్ మిర్ ఓవర్ స్టెప్పింగ్ తో నోబాల్ వేశాడని సూచిస్తూ, నోబాల్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రహానే తిరిగి డ్రెస్సింగ్ రూం నుంచి మైదానంలోకి రాగా, శార్దూల్ తిరిగి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. అయితే రహానే బ్యాటింగ్ పోజిషన్ తీసుకుంటుండగా, అతనితో ఆన్ ఫీల్డ్ అంపైర్ నోబాల్ గురించి చర్చించడం కనిపించింది. ఆన్ ఫీల్డు అంపైర్ బౌలర్ ని సరిగ్గ గమనించని కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. రహానే ఔట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు లైకులు, కామెంట్లు చేసి, షేర్లు చేస్తున్నారు.
నిబంధనల ప్రకరామే..
నిజానికొ ఒకసారి ఔట్ గా ప్రకటించిన తర్వాత దాన్ని మార్చే అధికారం అంపైర్లకు ఉంది. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లను నాటౌట్ లేదా ఔట్ గా ప్రకటించినప్పుడు సరైనా ఆధారాలు ఉన్నట్లయితే థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని, నిర్ణయాన్ని మార్పు చేసే అధికారం ఉంది. అయితే ఇదంతా బ్యాటర్ ఔటైన తర్వాత నెక్స్ట్ బంతి పడేలోపలే జరిగిపోవాలి. ఏదైన తప్పిదం దొర్లితే వెంటనే డెడ్ బాల్ గా ప్రకటించి, నిర్ణయాన్ని మార్పు చేసే అవకాశం ఉంటుంది. తాజా రంజీ మ్యాచ్ లో ఇదే విషయం చోటు చేసుకుందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇక ఇదే రంజీ మ్యాచ్ లో అంపైర్ల తప్పిదాలు చాలానే జరిగాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఔటయినట్లు క్లియర్ గా కనిపించినా, అంపైర్ తిరస్కరించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. ఏదేమైనా అంపైర్లు కూడా మానవ మాత్రులే కదా.. తప్పులు సహజమే అని పలువురు సర్ది చెప్పుకుంటున్నారు.
205 పరుగుల టార్గెట్..
ఇక గ్రూప్-ఏలో భాగంగా జరిగిన రంజీ మ్యాచ్ లో జమ్మూ కశ్మీర్ ముందు సవాలు విసిరే టార్గెట్ ను ముంబై ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో 290 పరుగులకు ఆలౌటౌంది. దీంతో 204 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన ముంబై.. ప్రత్యర్థి ముందు 205 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. శార్దూల్ ఠాకూర్ సెంచరీ (135 బంతుల్లో 119, 18 ఫోర్లు)తో మరోసారి ఆపధ్బాంధవుడిలా నిలిచాడు. స్పిన్నర్ తనుష్ కొటియన్ (62)తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి, ముంబైని రేసులోకి తీసుకొచ్చాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 184 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. బౌలర్లో అఖిబ్ నబీకి నాలుగు, యుద్వీర్ సింగ్ కు మూడు, ఉమర్ మిర్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇక తొలి ఇన్నింగ్స్ లో ముంబై 120 పరుగులకే కుప్పకూలగా, జమ్మూ కశ్మీర్ 206 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: India Playing XI: జట్టులో రెండు మార్పులు.. షమీ తిరిగొస్తాడా..? అభిషేక్ ఆడకపోతే ఆ ప్లేయర్ బరిలోకి..