టీమిండియాతో టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారి భారత్ లోకి అడుగుపెడుతుంది. జూన్ 11 న నుంచి 3 టీ20 ల సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ సిరీస్ కు ఎంపిక చేసినా.. ఆడటం అనుమానంగా మారింది. గత నెలలో ఈ స్టార్ స్పిన్నర్ వెన్ను గాయంతో సర్జరీ చేయించుకున్నాడు. జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. జనవరి 11 న మొహాలీలో తొలి టీ20, 14 న ఇండోర్ లో రెండో టీ20, 17న బెంగళూరులో మూడో టీ20 జరుగుతాయి. ఈ టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించాల్సి ఉంది.
అఫ్గనిస్తాన్ జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.
రషీద్‌కు సర్జరీ
అఫ్గనిస్థాన్ బౌలింగ్‌లో స్టార్ స్పిన్నర్, టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్‌కు వెన్నెముక సర్జరీ పూర్తయ్యింది. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటోను ఇటీవల రషీద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సర్జరీ సక్సెస్ అయ్యిందని, మళ్లీ మైదానంలోకి దిగేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. అభిమానుల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపాడు. అతడి పోస్ట్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans ) వెంటనే స్పందించింది. కింగ్ ఖాన్ నువ్వు తొందరగా కోలుకుంటావు అని కామెంట్ పెట్టింది.
క్రికెట్ అభిమానులకు బాగా దగ్గరైన విదేశీ క్రికెటర్లలో రషీద్ ఖాన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు టీం గా ఐపీఎల్ లో ప్రస్థానం కొనసాగిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా కొంతకాలం కొనసాగాడు రషీద్ ఖాన్. తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు అతను గుజరాత్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అయితే ఏ టీం కి మారినా తన ఆటతో మాత్రం క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
వన్డే వరల్డ్‌కప్‌లో...
మన దేశంలో ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో రషీద్ అద్భుతంగా రాణించాడు. అఫ్గన్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఆడలేదు. ఈ నేపధ్యంలోనే మెగా టోర్నీ తర్వాత సర్జరీ చేయించుకుంటానని ప్రకటించాడు. దీంతో ఆసీస్‌లో జరుగుతున్న బిగ్‌బాష్‌లీగ్ 13వ సీజన్‌కు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 జనవరిలో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ ఆడడం కూడా రషీద్‌కు కష్టమేనని తెలుస్తోంది.